sports

క్రికెట్ మ్యాచ్‌ల‌లో బ్యాట్స్‌మెన్ పిచ్‌ను బ్యాట్‌తో ట‌చ్ చేసి ప‌రిశీలిస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి&period; క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి&period; అయితే&comma; తరచూ బ్యాట్స్ మెన్ పిచ్ పై తమ బ్యాట్ తో ట్యాప్ చేయడం చూసే ఉంటారు&period; వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారన్న విషయం చాలామందికి తెలియదు&period; అయితే దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రికెట్ లో పిచ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది&period; అందుకే ప్రతి మ్యాచ్ కు ముందు పిచ్ ఎలా ఉందన్న దానిపై ప్రత్యేకంగా రిపోర్ట్ ఇస్తారు&period; పిచ్ కు తగినట్లే ఆయా టీమ్స్ తమ తుది జట్లను ప్రకటిస్తాయి&period; అలాంటి పిచ్ పై బ్యాట్స్ మెన్ బ్యాట్ తో కొట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి&period; పిచ్ ఎలా ఉందో తెలుసుకోవడం&comma; పిచ్ పై ఉన్న పగుళ్లను గుర్తించి వాటిని మూసివేసే ప్రయత్నం చేయడం&comma; కొన్ని సార్లు కేవలం తమ ఆందోళనను తగ్గించుకోవడానికి కూడా బ్యాటర్లు ఇలా చేస్తూ ఉంటారు&period; కొన్నిసార్లు క్రికెట్ పిచ్ ప్రమాదకరంగా కనిపిస్తుంది&period; వాటిపై ఉండే పగుళ్ల వల్ల ఒక్కోసారి బంతి ఊహించని విధంగా బౌన్స్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83056 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;batsmen&period;jpg" alt&equals;"why batsmen touch pitch " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నిసార్లు అనూహ్యంగా పైకి దూసుకురావడం&comma; మరికొన్నిసార్లు ఊహించిన దానికంటే తక్కువ ఎత్తులో రావటం జరుగుతుంది&period; ఇది బ్యాట్స్ మెన్ ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉంటుంది&period; అందుకే అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్యాటర్ నేరుగా క్రీజ్ లోకి రాగానే పిచ్ పై అక్కడక్కడ ట్యాప్ చేస్తుంటాడు&period; అలాంటి పగుళ్లు ఏమైనా కనిపిస్తే వాటిని మరీ ప్రమాదకరంగా మారకుండా చేసే ప్రయత్నమే ఇది&period; ఒక్కోసారి క్రీజ్ లో సెటిల్ అయిన బ్యాట్స్ మెన్ కూడా ఇలా అనహ్యమైన బౌన్స్ వచ్చినప్పుడు ఈ పని చేస్తుంటారు&period; బౌలర్లను వెయిట్ చేయించడం క్రికెట్ ఒక మైండ్ గేమ్ కూడా&period; బ్యాట్స్మెన్ లేదా బౌలర్ పై మానసికంగా కూడా పై చేయి సాధిస్తేనే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది&period; కొన్నిసార్లు ప్రత్యర్థిపై చేయి సాధిస్తున్న సందర్భాల్లో వాళ్లను మానసికంగా దెబ్బతీయడానికి ప్లేయర్స్ మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంటారు&period; అందులో ఈ పిచ్ టాపింగ్ కూడా ఒకటి&period; బ్యాట్స్ మెన్ ఒత్తిడిలో ఉన్న సమయంలో బౌలర్ ను కాసేపు వేచి చూసేలా చేయడానికి కూడా ఇలా పిచ్ పై ట్యాప్ చేస్తూ కాస్త రిలాక్స్ అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts