ఇంట్లో కిచెన్ అన్నాక దాదాపు అధిక శాతం మందికి వాష్ బేసిన్ లేదా గిన్నెలు తోమే సింక్ ఉంటుంది. కొంత మంది ఇళ్లలో కిచెన్‌కు సింక్ ఉండదు. ఇంకొందరు ఉన్నా దాన్ని ఉపయోగించరు. ఎంచక్కా బయట పాత్రలు వేసి తోముకుంటారు. అయితే కిచెన్‌లో సింక్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు ఎదుర్కోనే సమస్య ఒక్కటే. అదే సింక్ పైపుల్లో వ్యర్థాలు పేరుకుపోయి తరచూ నీరు జామ్ అవుతుండడం. ఈ క్రమంలో ఓ సింపుల్ ట్రిక్‌ను ఉపయోగిస్తే సింక్‌లో నీరు ఇక జామ్ అవదు. ఆ ట్రిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా సింక్‌లో నీరు పోయే జాలి వద్ద బేకింగ్ సోడా వేయాలి. జాలిని కప్పేలా బేకింగ్ సోడాను వేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ సోడాపై కొద్దిగా వెనిగర్‌ను వేయాలి. అయితే జాగ్రత్త సుమా! ఎందుకంటే బేకింగ్ సోడా, వెనిగర్ రెండూ కలిస్తే ఒక్కసారిగా పొగలతో పెద్దగా నురగ వస్తూ కెమికల్ రియాక్షన్ జరుగుతంది. కాబట్టి సింక్‌కు సాధ్యమైనంత దూరంగా ఉంటూనే వెనిగర్‌ను సోడాపై వేయాలి.
సోడా, వెనిగర్ రెండూ కలిసి పూర్తిగా సింక్ లోపలికి వెళ్తాయి. తరువాత కొంత వేడి నీటిని సింక్‌లో పోయాలి. మళ్లీ సాధారణ నీటిని పోసి కడగాలి. అంతే సింక్ తళతళా మెరవడమే కాదు, దానికి అటాచ్ అయి ఉన్న పైప్‌లోని జామ్ అంతా తొలగిపోతుంది.