Home Tips

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం !

<p style&equals;"text-align&colon; justify&semi;">వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు&period; అయితే నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు&period; కొంతమంది గ్యాస్ స్టవ్ వాడితే&comma; మరికొంతమంది వాటర్ హీటర్ తో నీళ్లు వేడి చేసుకుంటారు&period; ఇంకొందరేమో గీజర్ ఉపయోగిస్తారు&period; ఈమధ్య చాలామంది ఇళ్లలో గీజర్ ఉపయోగిస్తున్నారు&period; గీజర్ ద్వారా నీళ్లు క్షణాలలో మరిగిపోతాయి&period; అయితే గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు&period; మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గీజర్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మరిచిపోతే చాలా ప్రమాదం అని చెప్పొచ్చు&period; ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్ లో ఉంచితే అది పేలిపోతుంది&period; అందువల్ల దీనిని ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు&period; అవసరమైతే అలారం పెట్టుకుని మరీ దీన్ని ఆఫ్ చేయాలి&period; అయితే మార్కెట్లలో ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా దొరుకుతున్నాయి&period; అలాంటి వాటిని కొనుగోలు చేయడం చాలా సేఫ్&period; కొన్ని కొన్ని సార్లు ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే గీజర్ కొన్నా కూడా ఎప్పటికప్పుడు దానిని ఆఫ్ చేసుకోవడం మంచిది&period; పాత మోడల్ గీజర్ అయితే ఎప్పటికప్పుడు దాన్ని ఆఫ్ చేస్తుండాలి&period; ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తరచుగా సర్వీసింగ్&comma; రిపేర్ కూడా చేస్తే మంచిది&period; అయితే యూట్యూబ్ వీడియోలు చూసి గీజర్లను ఫిట్టింగ్ చేయాలని ప్రయత్నించడం చాలా మూర్ఖత్వం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83060 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;geyser&period;jpg" alt&equals;"you must follow these safety tips if you are using a geyser " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయంలో టెక్నీషియన్ల సహాయం తీసుకోవడం తప్పనిసరి&period; యూట్యూబ్ లో చూస్తూ ఫిట్టింగ్ చేసినట్లయితే చిన్న పొరపాటు జరిగిన అవి షాక్ కొట్టే ప్రమాదం లేకపోలేదు&period; ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు కూడా సొంత తెలివిని ప్రదర్శించకుండా టెక్నీషియన్ ని పిలిపించడం మంచిది&period; ఇక మరొక విషయం ఏమిటంటే బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది&period; గీజర్ లో ఉండే బ్యూటెన్&comma; ప్రాపేన్ అనే గ్యాసెస్ కార్బన్ డయాక్సైడ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి&period; ఈ గ్యాస్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది&period; అందువల్ల ఆ గ్యాస్ ని బయటికి పంపించడానికి బాత్రూం లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts