business ideas

ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్‌.. చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు..!

స్కూళ్లు, కాలేజీలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు.. ఇలా చాలా కోట్ల ఎ4 పేప‌ర్ల వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ప్రింట్ మీడియా సంస్థ‌ల్లోనైతే వీటిని విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే ఇవే ఎ4 పేప‌ర్ల‌ను త‌యారు చేసి మార్కెట్‌లో విక్ర‌యిస్తే చ‌క్క‌ని లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ వ్యాపారాన్ని చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రుగా కూడా మార్చుకోవ‌చ్చు. సుదీర్ఘ‌కాలం పాటు ఇందులో కొన‌సాగితే పెద్ద ఎత్తున లాభాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌రి ఎ4 పేప‌ర్ల త‌యారీ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో.. ఏ మేర ఆదాయం సంపాదించ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎ4 పేప‌ర్ల త‌యారీకి పేప‌ర్ రోల్ మేకింగ్ మెషిన్ అవ‌స‌రం అవుతుంది. దీని ధ‌ర రూ.5 ల‌క్ష‌ల వ‌రకు ఉంటుంది. అలాగే ఎ4 పేప‌ర్ల‌ను త‌యారు చేసేందుకు జీఎస్ఎం ఎ4 పేప‌ర్ రోల్స్ అవ‌స‌రం అవుతాయి. ఒక్కో కేజీ రోల్ ధ‌ర రూ.60 వ‌ర‌కు ఉంటుంది. వీటిని ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఇంట్లో ప్ర‌త్యేకంగా ఒక రూం ఉంటే.. ఇంట్లోనే ఈ మెషిన్‌ను పెట్టి ఎ4 పేప‌ర్ల‌ను త‌యారు చేసి విక్ర‌యించ‌వ‌చ్చు. మెషిన్‌లో ఎ4 పేప‌ర్ రోల్స్‌ను పెట్టి వాటిని పేప‌ర్లుగా క‌ట్ చేయాలి. అనంత‌రం వాటిని ప్యాక్ చేసి విక్ర‌యించాలి.

you can earn good money with a4 papers making

ఎ4 పేప‌ర్ బండిల్స్ ధ‌ర పేప‌ర్ల జీఎస్ఎం క్వాలిటీని బ‌ట్టి ఉంటుంది. సాధార‌ణంగా ఒక్క ఎ4 పేప‌ర్ బండిల్ త‌యారీకి రూ.100 వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. దాన్ని మార్కెట్‌లో రూ.180 నుంచి రూ.200కు విక్ర‌యించ‌వ‌చ్చు. దీంతో ఒక్క బండిల్‌పై ఎంత లేద‌న్నా క‌నీసం రూ.80 మార్జిన్ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో నిత్యం 50 బండిల్స్‌ను త‌యారు చేసినా 50 * 80 = రూ.4000 వ‌స్తాయి. అదే నెల‌కు అయితే 30 * 4000 = రూ.1,20,000 వ‌స్తాయి. ఇలా నెల నెలా ఆదాయం సంపాదించ‌వ‌చ్చు.

ఇక ఈ బిజినెస్‌కు గాను మార్కెటింగ్ బాగా చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ సెంట‌ర్లు, స్టేష‌న‌రీ షాపులు, స్కూళ్లు, కాలేజీలు, ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాలు, బ్యాంకులు, ఇత‌ర వాణిజ్య స‌ముదాయాల వారితో టై అప్ అయి ఎ4 పేప‌ర్ బండిల్స్‌ను త‌ర‌చూ స‌ప్ల‌యి చేయ‌వ‌చ్చు. దీంతో ఈ బిజినెస్‌లో చ‌క్క‌ని లాభాలు రావ‌డంతోపాటు సుదీర్ఘ‌కాలంపాటు ఇందులో కొన‌సాగి.. ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. ఇక బిజినెస్ ఎక్కువ‌గా అయ్యే ప్రాంతంలో మార్కెటింగ్ చేస్తే.. లాభ‌దాయకంగా ఉంటుంది. దీంతో స‌ప్ల‌యి పెంచుకుని, ప్రొడ‌క్ష‌న్ ఎక్కువ చేసి.. ఆ మేర లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Admin