business ideas

మీ ఇంట్లోనే చిన్న‌పాటి ఖాళీ స్థ‌లంలో ముత్యాల‌ను సాగు చేయండి.. త‌క్కువ పెట్టుబ‌డితోనే రూ.ల‌క్ష‌ల్లో ఆదాయం పొంద‌వ‌చ్చు..!

స్వ‌యం ఉపాధి పొందేందుకు మ‌న‌కు అందుబాటులో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో త‌క్కువ పెట్టుబ‌డితో కొద్దిపాటి శ్ర‌మ‌తో రూ.లక్ష‌ల్లో డ‌బ్బులు సంపాదించుకునే ఉపాధి అవ‌కాశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ముత్యాల సాగు ఒక‌టి. ముత్యాల‌ను సాగు చేయాలంటే చెరువులు, స‌ర‌స్సులు అవ‌స‌రం లేదు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డి పెట్టాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే లేదా ఇంటి బ‌య‌ట ఖాళీ స్థ‌లం ఉంటే ముత్యాల‌ను సాగు చేయ‌వ‌చ్చు.

ముత్యాల‌ను సాగు చేసేందుకు కేవ‌లం రూ.1 ల‌క్ష నుంచి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి చాలు. ఇంట్లో చిన్న పాటి స్థ‌లం ఉంటే అందులో సాగు చేయ‌వ‌చ్చు. లేదా 14×14 అడుగుల సైజ్ ఉన్న చిన్న పాటి గ‌ది లేదా షెడ్డును అద్దెకు తీసుకుని అందులో ముత్యాల‌ను సాగు చేయ‌వ‌చ్చు. రూ.1 ల‌క్ష పెడితే 2000 ఆల్చిప్ప‌లు వ‌స్తాయి. ఇక నీటి తొట్టెలు, ఇత‌ర సామ‌గ్రికి రూ.30వేల నుంచి రూ.50వేలు ఖ‌ర్చు అవుతాయి.

you grow pearls and earn good income

ఇక ఆల్చిప్ప‌ల్లో ముత్యాలు ఏర్ప‌డేందుకు సుమారుగా ఏడాది ప‌డుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో 10 నెల‌లకే ముత్యాలు ఉత్ప‌త్తి అవుతాయి. అయితే ఆల్చిప్ప‌ల్లోని జీవులు ముత్యాల‌ను త‌యారు చేసేందుకు వాటికి రోజూ గ్రీన్ ఆల్గేను వేయాలి. అలాగే తాళ్ల‌తో నెట్స్‌ను ఏర్పాటు చేయాలి. దీంతోపాటు నీటి ఉష్ణోగ్ర‌త‌ను చెక్ చేసుకోవాలి. నీటిని శుభ్రంగా ఉంచాలి. ఈ విధంగా రోజూ 2 గంట‌ల స‌మ‌యం కేటాయిస్తే చాలు. 10-12 నెల‌ల‌య్యే స‌రికి ముత్యాలు ఉత్పత్తి అవుతాయి.

ఇక కొన్ని ఆల్చిప్ప‌ల్లో 2-6 స్వ‌చ్ఛ‌మైన ముత్యాలు త‌యార‌వుతాయి. కొన్ని ర‌కాల ప్ర‌త్యేక‌మైన ఆల్చిప్ప‌లు అయితే 20 వ‌ర‌కు ముత్యాలు వ‌స్తాయి. మార్కెట్‌లో ఒక్కో ముత్యాన్ని రూ.300 నుంచి రూ.500 మ‌ధ్య విక్రయిస్తారు. అంటే ఒక్క ఆల్చిప్ప ద్వారా 2 ముత్యాలు వేసుకున్నా 2000 ఆల్చిప్ప‌ల‌కు 4000 ముత్యాలు వ‌స్తాయి. 4000 వేల ముత్యాల‌ను ఒక్కోదాన్ని రూ.300కు విక్ర‌యించినా.. 4000 * 300 = 12,00,000 అవుతాయి. అంటే పెట్టుబ‌డి పెట్టిన రూ.1.50 ల‌క్ష‌లు తీసేస్తే రూ.10.50 ల‌క్ష‌ల లాభం వ‌స్తుంద‌న్న‌మాట‌.

అయితే ఇంత భారీ మొత్తంలో పెట్టుబ‌డి ఎందుక‌ని అనుకున్నా ముందుగా త‌క్కువ మొత్తంలో ముత్యాల‌ను సాగు చేయ‌వ‌చ్చు. ఇక ఒక‌సారి ఆల్చిప్ప‌ల‌ను కొంటే వాటి జీవిత కాలం సుమారుగా 60 ఏళ్లు ఉంటుంది. క‌నుక వాటిని మాటి మాటికీ కొనాల్సిన ప‌ని ఉండ‌దు. అంటే రెండో ఏడాది నుంచి లాభం ఇంకా పెరుగుతుంది. అయితే ఆల్చిప్ప‌లు కొన్నిసార్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల చ‌నిపోతుంటాయి. క‌నుక వాటికి బ‌దులుగా కొత్త వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ముత్యాల‌ను సాగు చేస్తూ లాభాల‌ను గ‌డించ‌వ‌చ్చు.

ముత్యాల సాగుపై ప్ర‌స్తుతం అనేక అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీల్లో కోర్సుల‌ను అందిస్తున్నారు. కొన్ని వారాల వ్య‌వ‌ధితో కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. దీంతో ముత్యాల‌ను సాగు చేయ‌డం మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది.

Admin

Recent Posts