ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే మ‌నుషుల‌కు ఇంకో జ‌న్మ ఉండ‌దు.. నేరుగా కైలాసం చేరుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్రదేశంలో పంచారామాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు&period; అలాంటి పవిత్రమైన పంచారామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం&period; ఈ క్షేత్ర విశేషాలు&comma; పురాణగాథ&comma; రవాణా సౌకర్యం తదితరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం&period; బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైవం&period; తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయిన ఐదు ప్రదేశాల్లో పడి దివ్వమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి&period; ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు&period; అలా వాటిలో ఒకటి అమరావతిలో పడింది&period; అప్పటి నుండి అమరలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్న శైవక్షేత్రంగానే కాకుండా బౌద్ధ మతపరంగానూ అమరావతి ప్రఖ్యాతీ చెందినది&period;అమరేశ్వర ఆలయం ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడినది&period; దేవేరి రాజ్యలక్ష్మీ అమ్మవారు కూడా కొలువుదీరారు&comma; పంచప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడినది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ శివలింగం సుమారు 15 అడుగుల ఎత్తు ఉంది&period; అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు&period; ఆలయంలో మూడు ప్రాకారాలు&comma; నాలుగు దిక్కుల నాలుగు ధ్వజ స్థంభములు దక్షిణ ద్వారంలో ముఖ మండపం&comma; తూర్పు ద్వారమునకు ఎదురుగా కృష్ణానది ఉంది&period; మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు&comma; కాశీ విశ్వేశ్వరుడు&comma; ఉమామహేశ్వరుడు&comma; అగస్త్యేశ్వరుడు&comma; పార్ధివేశ్వరుడు&comma; సోమేశ్వరుడు&comma; కోలలేశ్వరుడు&comma; వీరభద్రుడు&comma; త్రిపుర సుందరీదేవి ఆలయాలు&comma; కల్యాణ మండపం&comma; కృష్ణానదికి తోవ ఉన్నాయి&period; రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు&comma; కాలభైరవుడు&comma; కుమారస్వామి ఆలయాలు&comma; నవగ్రహ మంటపం&comma; యజ్ఞశాలలు ఉన్నాయి&period; మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు&comma; కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81330 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;amareshwara-temple&period;jpg" alt&equals;"amareshwara temple in amaravathi know its speciality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందగిరిని వాసుకి సర్పంతో సముద్ర మధనం చేసిన తర్వాత అమృతం వచ్చింది కదా&excl; అప్పుడు విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించి అమృతం భాండాన్ని చేపట్టి దేవతలకు&comma; రాక్షసులకు పంచసాగాడు&period; అప్పడు అమృతం దేవతలకు&comma; రాక్షసులకు సమానంగా పంచడం లేదని తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాక్షసులు ఆందోళనలు చేశారు&period; త్రిపురాసురులు&comma; నాధుల నేతృత్వంలో తపస్సు చేశారు&period; బోళాశంకరుడు వారి తపస్సుకు ముగ్ధుడై వరాలు ప్రసాదించాడు&period; దాంతో ఆ వరాలందుకున్న రాక్షుల్లో ఉత్తేజం మరింత పెరిగింది&period; దాంతో దేవతలను మరింత ఎక్కువగా హింసించసాగారు&period; దేవతలు శివుడికి మెరపెట్టుకోవడంతో శివుడు కాలరుద్రుడై రాక్షసులను వారి రాజ్యాన్ని క్షణంలో బూడిద చేసి త్రిపురాంతకుడు అయ్యాడు&period; ఆ సమయంలో త్రిపురాసురుడు మింగిన పెద్ద లింగం ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడటం వల్ల ఆ ఐదు ప్రదేశాలు పంచారామాలుగా విలసిల్లుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమరావతిలో పడిన శివలింగం భాగము ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టు పెరగసాగింది&period; అది చూసిన దేవేంద్రడు శివలింగంపై తన గోరుతో పొడిచాడు&period;దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింది&period; అయితే ఇంద్రుని గోరు గుచ్చుకుని శివలింగానికి రక్తం కారింది&period; ఆ రక్తపు చారల చిహ్నంగా ఇప్పటికీ అమరావతి క్షేత్రంలోని అమరలింగేశ్వర ఆలయంలోని శివలింగానికి గుర్తులు కనబడుతాయి&period; ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ&comma; ఈ క్షేత్రములో శివుడు ప్రణవేశ్వరుడనీ&comma; అగస్తేశ్వరుడనీ&comma; కోసలేశ్వరుడనీ&comma; సోమ్యేశ్వరుడనీ&comma; పార్థివేశ్వరుడనే పేర్లతో పంచలింగాకారుడై పూజింపబడుచున్నాడు&period; ఏ భక్తుడైనా ఈ పుణ్యక్షేత్రములో మూడు రోజులు నివసించి కృష్ణాతీర్థములో స్నానమాచరించి అమరేశ్వరుని కొల్చినవారు మరణానంతరము శివసాయుజ్యము పొందుదురు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-81329" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;amareshwara-temple-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాతవాహనుల కాలంలో అమరావతీ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు&period; అప్పట్లో అమరావతి వారి రాజధాని&period; ఈ నగరాన్ని ధరణి కోట లేదా ధాన్యకటం అని పిలిచేవారు&period; ఈ పవిత్ర దేవాలయంలో అపురూపంగా మలచిన అనేక విగ్రహాలున్నాయి&period; అమరావతి దత్త క్షేత్రం కూడా&period;&period; కృష్ణానది చెంతన ఈ క్షేత్రం కృష్ణానదికి పక్కనే ఉంటుంది&period; అమరలింగేశ్వరుడిని దర్శించడానికి భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి&comma; పునీతమై అమరేశ్వరుని దర్శించుకుంటారు&period; ఈ ఆలయంలో పై అంతస్తులో అభిషేకం చేస్తారు&period; అమరేశ్వర లింగం ఎంతో ఎత్తుగా ఉండటానికి కింద నుండి అభిషేకం చేయడం వీలుపడదు&period; కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరేశ్వరాలయం దగ్గర 105కి&period;మీ పొడవుతో పుష్కరఘాట్ ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగుతుంది ఈ ప్రదేశం&period; ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి బస్సు సౌకర్యం ఉంది&period; ఇక్కడికి గుంటూరు నుండి ప్రతి 15నిముషాలకు&comma; విజయవాడ నుండి 20 నిముషాలకు ఓ బస్సు ఉంటుంది&period; గుంటూరు నుండి 40 కి&period;మీ&period;à°² దూరంలో కలదు&period; గుంటూరు&comma; విజయవాడ&comma; మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts