Friday : చాలామంది చేసే తప్పులు వలన అనవసరంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు. శుక్రవారం నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. వీటిని పాటించారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది లేదంటే జేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రవారం చాలా ప్రత్యేకమైనది. మహాలక్ష్మి దేవికి శుక్రవారం ఎంతో ఇష్టం. స్త్రీలకి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. ఎలాంటి తప్పులు చేయకూడదనేది చూసుకుంటే, ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. ఐశ్వర్యం కలుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించడం చాలా ముఖ్యం. ఎంతో భక్తి శ్రద్ధతో అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం పొందచ్చు.
అమ్మవారి ఆలయానికి వెళితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. తప్పకుండా స్త్రీలు శుక్రవారం నాడు తల స్నానం చేయాలి. తులసి చెట్టుకి కూడా పూజ చేయాలి. ధూప, దీప నైవేద్యాలని పెట్టి అమ్మవారిని ప్రార్థించాలి. లేచిన తర్వాత మొదట అమ్మవారికి నమస్కరించి, ఆ తర్వాత పనుల్ని మొదలు పెట్టాలి. ఇంటి గడపకి పసుపు రాసి, కుంకుమ పువ్వులతో అలంకరణ చేయాలి ఎందుకంటే మహాలక్ష్మి దేవి పచ్చగా ఉన్న గుమ్మం చూసి అడుగుపెడుతుంది.
స్త్రీలు అసలు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. అలానే ఏ బాధ లేకుండా ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. సంతోషంగా స్త్రీలందరూ కూడా ఉండాలి. శుక్రవారం నాడు అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. శుక్రవారం పూట ఈశాన్యంలో అసలు చీపురు పెట్టకండి. శుక్రవారం పూట పాత బట్టల్ని, ధాన్యాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఆవు నెయ్యి తో శుక్రవారం నాడు దీపం పెడితే మంచిది. అమ్మవారి ప్రతిమ శుక్రవారం నాడు ఇంటి గడప దాటి వెళ్ళకూడదు.
శుక్రవారం నాడు మాసిన బట్టలు కట్టుకోకూడదు. బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టడం వంటివి కూడా చేయకూడదు, శుక్రవారం నాడు లక్ష్మీదేవి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు దానధర్మాలు చేస్తే కూడా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. సంధ్యా సమయంలో ఇంటి ముఖ ద్వారం, కొంచెం సేపు తెరిచి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శుక్రవారం పసుపు, ఎరుపు, ఆకుపచ్చ దుస్తులు కట్టుకోవడం మంచిది. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కష్టాలు అన్ని తొలగిపోతాయి.