ఆధ్యాత్మికం

సంక్రాంతి రోజు వీటిని దానం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. క‌ష్టాలు వ‌స్తాయి..!

ఏ పండుగ వ‌చ్చినా స‌రే హిందువులు చాలా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఇక తెలుగువారు ఘ‌నంగా జ‌రుపుకునే పండుగ‌ల్లో సంక్రాంతి పండుగ కూడా ఒక‌టి. ఈ పండుగ రోజు అనేక పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌డంతోపాటు దాన ధ‌ర్మాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజు సూర్యున్ని పూజిస్తారు. ఆ త‌రువాత దానాలు, ధ‌ర్మాలు చేస్తుంటారు. ఇక సంక్రాంతి స‌మ‌యంలో అంద‌రూ త‌మ కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ధాన్యం స‌మృద్ధిగా ఉంటుంది క‌నుక ధాన్యాన్ని కూడా దానం చేస్తుంటారు. దీంతో ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తుంటారు. అయితే కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను మాత్రం దానం చేయ‌కూడ‌దు.

సంక్రాంతి రోజు కొంద‌రు కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను తెలియ‌క దానం చేస్తుంటారు. దీని వ‌ల్ల అశుభ ఫలితాల‌ను అనుభ‌వించాల్సి వ‌స్తుంది. సంక్రాంతి పండుగ‌ను ఈ సారి జ‌న‌వ‌రి 14వ తేదీన జ‌రుపుకుంటున్నారు. ఆ రోజున పుణ్య న‌దుల్లో స్నానం చేయ‌డం మంచిది. దీంతో ఎంతో మంచి ఫ‌లితం ల‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు. ఇక దానాలు చేయ‌డం వ‌ల్ల కూడా పుణ్యం ల‌భిస్తుంది. అయితే కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను మాత్రం దానం చేయ‌కూడ‌దు. సంక్రాంతి రోజు ఎట్టి ప‌రిస్థితిలోనూ నూనెను దానం చేయ‌వ‌ద్దు. అలా చేస్తే అంతా అశుభ‌మే జ‌రుగుతుంది. సంక్రాంతి రోజు నూనెను దానం చేయ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ట‌.

do not donate these items on sankranthi

అదేవిధంగా ఈ పండుగ రోజు న‌లుపు రంగు దుస్తుల‌ను కూడా ఎవరికీ దానం చేయ‌కూడ‌దు. ఇది ప్ర‌తికూల శ‌క్తిని అందిస్తుంది. ప‌దునైన వ‌స్తువుల‌ను కూడా సంక్రాంతి పండుగ నాడు ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దు. క‌త్తెర‌లు, సేఫ్టీ పిన్స్ వంటివి ఇవ్వ‌కూడ‌దు. క‌త్తిని కూడా ఇవ్వ‌కూడ‌దు. ఇలాంటి వ‌స్తువుల‌ను దానం చేస్తే ప్ర‌తికూల శ‌క్తి ప్ర‌వ‌హిస్తుంది. పాజిటివ్ ఎన‌ర్జీ పోతుంది. దీంతో స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటారు. కుటుంబంలో గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. కాబ‌ట్టి ఈ వ‌స్తువుల‌ను పండుగ నాడు ఎవ‌రికీ ఇవ్వ‌కండి.

Admin

Recent Posts