ఆధ్యాత్మికం

దేవుడికి పువ్వులతో పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు

మనం సాధారణంగా ఏ పూజ చేస్తున్నా ఆ పూజలో తప్పకుండా పువ్వులను ఉపయోగిస్తాము. ఈ విధంగా స్వామివారికి పువ్వులతో అలంకరించి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము. అయితే నిజంగానే దేవుడికి పువ్వులతో పూజ చేయాలా ? పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్ని గానీ, పండును గానీ, కొద్ది పాటి జలమును గానీ సమర్పిస్తారో అలాంటి వారి నైవేద్యాన్ని తృప్తిగా తీసుకుంటానని సాక్షాత్తు శ్రీ కృష్ణపరమాత్మడు భగవద్గీతలో చెప్పడంతో పూజకు పువ్వులు ఎంతో ముఖ్యమైనవని చెప్పవచ్చు. స్వామివారికి పువ్వులు సమర్పించేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు మైల వాళ్లు, బహిష్టు అయిన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అటువంటి పూలని దేవునికి సమర్పించినా అవి పనికిరావు.

do not make these mistakes with flowers while doing pooja to god

నేలపై పడిన పుష్పాలను, వాసన చూసిన పువ్వులను, వాడిపోయిన పువ్వులు, ముళ్ళు కలిగిన పువ్వులు, కడిగిన పుష్పాలు, దుర్గంధ పూరితమైన పువ్వులను దేవుడి పూజలో సమర్పించ కూడదని పండితులు చెబుతున్నారు. ఇటువంటి పువ్వులను సమర్పించడం వల్ల మనం చేసిన పూజా ఫలితాన్ని పొందలేము. కనుక స్వామివారికి ఎల్లప్పుడూ ఎర్రటి కలువ పువ్వులు, గన్నేరు, పారిజాతం, మల్లె, నందివర్ధనం వంటి పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆ దేవ దేవతల అనుగ్రహం పొందగలరని పండితులు చెబుతున్నారు.

Share
Admin

Recent Posts