Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

దేవుడి ప్ర‌సాదాన్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

Admin by Admin
July 14, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అంతా ఆ భగవంతుని ప్రసాదమే! : దేవుడు సర్వాంతర్యామి. సర్వజ్ఞుడు. దేవుడు సర్వ సమగ్రుడు కాగా, మానవుడు ఓ చిన్న భాగం మాత్రమే. మనమేం చేసినా అది దేవుడు అందించే శారీరిక బలం, విజ్ఞానాల ద్వారానే! కాబట్టి జీవితంలోని మన చర్యలు, వాటి ఫలితాలన్నీ దైవం వల్ల సంప్రాప్తమైనవే! అందుకే దేవునికి నైవేద్యం సమర్పించడం ద్వారా ఆయనకు మన కృతజ్ఞతలు తెలుపుకుంటాము. కాబట్టి అలాంటి ప్రసాదాలను నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ప్రసాదాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారా? కుంకుమ, పుష్పాలను ఇంటికి తీసుకొచ్చి.. ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. లేదంటే ఈ ధోరణి దోషంగా మారి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేవాలయంలో భగవంతుడిని దర్శించుకుని పూజ చేయడం.. భగవంతుడి ప్రసాదంగా అర్చకుడు ఇచ్చిన కుంకుమ, పుష్పం, తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక దేవాలయానికి వెళ్లి వస్తూ ఎదురుపడిన వాళ్లు అక్కడి ప్రసాదాన్ని ఇస్తే, ఇంటికి రాగానే దానిని ఎక్కడో ఒకచోట పెట్టి మరిచిపోవడం చేస్తుంటారు. భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించకపోవడం, ప్రసాదాన్ని పవిత్రంగా భావించకపోవడం వంటివి ఓ రకంగా ఆయనను అవమానపరచడమే అవుతుందని, ఇది దోషంగా మారే ప్రమాదముందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా సాక్షాత్తు ఇంద్రుడే ఇబ్బందుల్లో పడినతీరు మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకసారి దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని వస్తూ వుండగా, దేవేంద్రుడు తారసపడతాడు. వినయ పూర్వకంగా దేవేంద్రుడు నమస్కరించడంతో, తనకి నారాయణుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా ఆయన దేవేంద్రుడికి ఇస్తాడు.

do not neglect god prasadam and do put it every where

ఆ పుష్పాన్ని అందుకున్న వెంటనే దేవేంద్రుడు దానిని ఐరావతం తలపై పెడతాడు. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదం ఏదైనా అది అత్యంత పవిత్రమైనదిగా భావించి స్వీకరించాలనీ, భక్తి భావంతో వ్యవహరించాలని చెబుతాడు. స్వామివారి ప్రసాదానికి ఎవరైతే తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెడతారో, అలాంటివారికి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుందంటాడు. లక్ష్మీదేవి లేని చోటు కళావిహీనమై అనేక కష్ట నష్టాలకు వేదికగా మారుతుందని అంటాడు. దుర్వాస మహర్షి పలుకుల మేరకు అసురుల కారణంగా ఇంద్రుడు తన పదవిని కోల్పోతాడు. దేవేంద్రుడు కొంతకాలం పాటు నానాఇబ్బందులు పడతాడు. ఆ తరువాత స్వామివారికి క్షమాపణ చెప్పుకుని తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు.

అందువలన భగవంతుడి ప్రసాదంగా లభించినది ఏదైనా దానిని ఎంతో పవిత్రమైనదిగా భావించాలని ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని పండితులు సూచిస్తున్నారు. ప్రసాదాన్ని భవ్యంగా స్వీకరించడం ద్వారా స్వామి వారి అనుగ్రహంతో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.

Tags: prasadam
Previous Post

బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

Next Post

శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?

Related Posts

vastu

శంఖం ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..?

July 14, 2025
వినోదం

బాహుబ‌లి పాత్ర కోసం…ప్ర‌భాస్…తీసుకున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్..లిస్ట్ ఇదిగో ఇంత‌లా ఉంది!?

July 14, 2025
technology

నాణ్య‌మైన ఫొటోలు, వీడియోలు కావాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఇది ఉండాలి..!

July 14, 2025
technology

USB Type-C అంటే ఏమిటో… దాని వ‌ల్ల మ‌న‌కు ఉపయోగాలేంటో తెలుసా..?

July 14, 2025
హెల్త్ టిప్స్

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దూర ప్ర‌యాణం చేయ‌కూడదా..?

July 14, 2025
వైద్య విజ్ఞానం

గుండె జ‌బ్బు వ‌స్తుంద‌ని అనుమానంగా ఉందా..? అయితే ఈ టెస్టులు త‌ప్ప‌నిస‌రి..!

July 14, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.