ఆధ్యాత్మికం

Cot : మంచంపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.. ఎందుకో తెలుసా..?

Cot : మన పెద్దలు మనకు ఎంతో కాలం నుంచి అనేక పద్ధతుల గురించి చెబుతూ వస్తున్నారు. అయితే మనం మాత్రం ఇంకా అలాంటివి కూడా నమ్ముతారా.. అని అంటుంటాం. కానీ మన పెద్దలు చెప్పే వాటి వెనుక సైన్స్‌ కూడా దాగి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఎంతో కాలం నుంచి అనేక విషయాలను చెబుతూ వస్తుండగా.. వాటిల్లో ఇదొకటి. మంచం మీద కూర్చుని కాళ్లను ఊపకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచం మీద లేదా కుర్చీలు వంటి వాటిలో కూర్చుని కాళ్లు ఊపడం వల్ల అరిష్టం సంభవిస్తుందట. ఇంట్లోని వారందరికీ సమస్యలు వస్తాయట. ఏది చేసినా అస్సలు కలసిరాదట. అన్నింటా నష్టాలే వస్తాయట. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక మంచం మీద లేదా ఇతర వాటిపై కూర్చుని కాళ్లను ఊపరాదు.

do not shake legs while sitting on the cot

ఇక ఆయర్వేదం ప్రకారం కూడా ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే కాళ్లను అలా ఊపినప్పుడు నరాల్లో బలహీనత వస్తుందట. దీంతో కొన్ని సందర్భాల్లో వీర్యం పోతుందట. అలాగే శృంగారం పట్ల ఆసక్తి, ఉత్సాహం అన్నీ పోతాయట. దంపతుల మధ్య కలహాలు వస్తాయని చెబుతున్నారు. కనుక మంచం లేదా ఇతర వాటిపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.

Admin

Recent Posts