ఆధ్యాత్మికం

శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఈ స్తోత్రం పఠించండి.. అనుకున్నవి నెరవేరుతాయి..!

సాధారణంగా మహిళలు శుక్రవారం మహాలక్ష్మికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల తమ కుటుంబం ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి స్తోత్రం చేయాలి.

సాధారణంగా శివుడికి అభిషేకం, విష్ణువుకి అలంకారం, సూర్యుడికి నమస్కారం, వినాయకుడికి తర్పణం ఎలాగైతే ఇష్టమో అమ్మవారికి స్తోత్రం అంటే ఇష్టం. శుక్రవారం అమ్మవారి స్తోత్రం పఠిస్తూ పూజ చేయడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

do pooja to ammavaru on friday like this and read this mantra

శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి “స్తుతా దిశసి కామం” అనే సూత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా అమ్మవారిని స్మరణ చేయటం వల్ల మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts