పోష‌కాహారం

Papaya Seeds : బొప్పాయి పండ్ల‌ను తింటే ఈసారి గింజ‌ల్ని ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

Papaya Seeds : ఆరోగ్యానికి బొప్పాయి పండ్లు మేలు చేస్తాయని, చాలామంది బొప్పాయి పండ్లను తింటూ ఉంటారు. బొప్పాయి వలన కలిగే ప్రయోజనాలు కూడా అందరికీ తెలుసు. అయితే, బొప్పాయి పండ్ల వలన కలిగే లాభాలు తెలిసినా, బొప్పాయి పండ్ల గింజల వలన కలిగే లాభాలు చాలామందికి తెలియదు. పండు తినేటప్పుడు, పండు కోసుకుని గింజల్ని పారేస్తూ ఉంటాం. అందరూ ఇదే చేస్తూ ఉంటారు. కానీ, నిజానికి బొప్పాయి గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఈ ఆరోగ్య ప్రయోజనాలను కనుక మీరు చూసినట్లయితే, కచ్చితంగా ఈసారి బొప్పాయి గింజల్ని దాచిపెట్టుకుని తింటారు.

బొప్పాయి గింజల వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి బొప్పాయి గింజలు బాగా ఉపయోగపడతాయి. రోజుకి 10 నుండి 15 గింజల్ని సలాడ్లలో లేదంటే కూర మీద చల్లుకొని తీసుకోండి. లేదంటే, మీరు పొడి చేసుకుని తీసుకోవచ్చు. ఈ పొడిని తీసుకుంటే, లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అలానే, కిడ్నీ వ్యాధులని బొప్పాయి గింజలు నయం చేస్తాయి. బొప్పాయి గింజలతో జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు బొప్పాయి గింజల్ని తీసుకుంటే, ఆ సమస్య నుండి బయటపడొచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచుకోవచ్చు.

papaya seeds wonderful health benefits

అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వాళ్ళు బొప్పాయి గింజల్ని తీసుకుంటే, చక్కగా ఆ సమస్యల నుండి బయటకి వచ్చేయొచ్చు. రక్తపోటుని నియంత్రణలో ఉంచేటట్టు బొప్పాయి గింజలు చేస్తాయి. కండరాలని దృఢంగా మార్చగలవు. పని ఒత్తిడి వలన చాలామంది అలసటతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు, బొప్పాయి గింజల్ని తీసుకుంటే, అలసట తగ్గుతుంది. బొప్పాయి గింజలు ఒకేసారి మీరు తీసుకుని ఎండబెట్టుకుని పొడి చేసుకోవచ్చు.

ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటుంది. పాడవదు. ఈ పొడిని మీరు కాఫీ, టీ లలో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ఈ పొడి కాస్త చేదుగా ఉంటుంది. కనుక, మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కొంచెం తేనెను కానీ బెల్లాన్ని కానీ క‌లిపి తీసుకోవచ్చు. రోజుకి పావు స్పూన్ వరకు తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకోవద్దు. ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే, డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం మంచిది.

Admin

Recent Posts