ఆధ్యాత్మికం

చనిపోయిన వారిని ఆ దేవాలయంలో బ్రతికించవచ్చట తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచమంతా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా పరుగులు తీస్తోంది&period; ప్రతి ఒక్క పనికి టెక్నాలజీ వాడకం అధికమైపోయింది&period; దీంతో మానవుడి మనుగడ సులభతరమైంది&period; అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి చావును మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు&period; మృత్యువు అంటూ వచ్చాక దానికి స్వాగతం చెప్పాల్సిందే కానీ&period;&period; దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు&period; అయితే మన దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలో మాత్రం చనిపోయిన వారిని బతికించవచ్చట&period; ఏంటీ&period;&period; షాకింగ్‌గా ఉందా&period;&period;&quest; మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా&period;&period;&quest; డెహ్రాడూన్‌కు 125 కిలోమీటర్ల దూరంలో లఖమండల్ దేవాలయం ఉంది&period; ఇందులో శివున్ని&comma; ఆది పరాశక్తిని కొలుస్తారు&period; లఖ్‌మండల్ అంటే లక్ష à°¶à°¿à°µ లింగాలు అన్నమాట&period; 8à°µ శతబ్దాంలో లక్ష à°¶à°¿à°µ లింగాలు ఇక్కడ ఉండేవట&period; కానీ కాలక్రమేణా అవి అంతరించిపోయాయట&period; ఇక ఈ దేవాలయానికి సంబంధించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి బ్రహ్మ&comma; విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటారు&period; దీంతో వారి మధ్యలో భారీ శివలింగం వెలుస్తుంది&period; దాని ఆది&comma; అంతం చూసేందుకు బ్రహ్మ&comma; విష్ణువులు ఇద్దరూ చెరో వైపుకు వెళ్తారు&period; కానీ వారు ఎంత దూరం వెళ్లినా శివలింగం ఆది&comma; అంతం కనిపించవు&period; దీంతో వారు తమ ఓటమిని అంగీకరిస్తారు&period; అప్పుడు శివుడు వారిని తగవులాడుకోవద్దని చెప్పి పంపుతాడు&period; అలా ఆ శివలింగం ఈ ప్రాంతంలోనే ఏర్పడిందని&comma; అందుకనే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతారు&period; ఇక మరో కథ ఏమిటంటే… అరణ్యవాసంలో ఉన్న పాండవులు లక్క ఇంట్లో నిద్రిస్తుండగా&comma; అది తెలుసుకున్న కౌరవులు ఆ ఇంటిని మంటలకు ఆహుతి చేస్తారు&period; కానీ నిద్రపోతున్న పాండవులను ఆది పరాశక్తి వచ్చి రక్షిస్తుందట&period; దీంతో ఆ ప్రదేశంలో ఈ ఆలయం నిర్మాణమైందని చెబుతారు&period; అందుకే ఇక్కడ ఆది పరాశక్తిని కూడా కొలుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78889 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lakhmandal-temple&period;jpg" alt&equals;"do you know these interesting facts about lakhmandal temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక లఖమండల్ ఆలయానికి చెందిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది&period; ఈ ఆలయంలో ఉన్న రెండు ద్వారపాల బొమ్మల మధ్య చనిపోయిన వారి మృతదేహాలను ఉంచి వారిపై ఆలయ కొలనులోని నీరు చల్లితే వారు బతుకుతారని&comma; కొంతసేపు వారు బతికి à°¶à°¿à°µ నామ స్మరణ చేసి&comma; మళ్లీ జలం చల్లగానే చనిపోతారని కథ ప్రాచుర్యంలో ఉంది&period; అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న శివలింగంపై నీరు పోస్తే ఆ లింగంపై మన ప్రతిబింబం అద్దంలో వలె కనిపిస్తుంది కూడా&period; ఇక ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజున సంతానం లేని దంపతులు పూజ చేస్తే వారికి సంతానం కలుగుతుందని ప్రచారంలో ఉంది&period; మరి ఈ ఆలయం మీక్కూడా చూడాలని ఉంటే వెంటనే వెళ్లి రండి మరి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts