ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే దీర్ఘాయువు పొంద‌వ‌చ్చ‌ట తెలుసా..?

భీమకాళీ దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సరహన్‌లో ఉంది. ఈ దేవాలయాన్ని దాదాపు 800 ఏండ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ హిందూ, బౌద్ధుల నిర్మాణ శైలిల సమ్మేళనంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెల్లవారుఝామున, సాయంత్రం హారతి వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. భారత దేశంలోనే శక్తి పీఠాలలో ఒకటి ఈ భీమకాళీ ఆలయం. ఈ ఆలయంలో భీమకాళీ అమ్మవారిని కన్య స్త్రీగా వర్ణింపచేసే ప్రతిమని ప్రతిష్టించారు. ఈ కాంప్లెక్స్‌లో ఉన్న మరో రెండు ఆలయాలు రఘునాథుని ఆలయం భైరోన్ నర్సింగ్ ఆలయాలున్నాయి.

ఇక్కడి దేవాలయంలోని భీమకాళీని దర్శిస్తే వివాహ సౌఖ్యం, దీర్ఘాయువు లభిస్తాయని పురాణాలూ చెబుతున్నాయి. అలాగే మరికొన్ని గాథలు, మహర్షి బ్రహ్మగిరి కమండలంలో భీమకాళీ అమ్మవారు మొట్ట మొదట దర్శనమిచ్చారని చెబుతున్నాయి. ఇక్కడ దసరా పండుగని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. బియాస్ నది ఒడ్డున ఉన్న భీమకాళి ఆలయంలో హిందూ దేవతలు, దేవతల ప్రత్యేక చిత్రాలను ప్రదర్శించే పెద్ద మ్యూజియం ఉంది. బానాసురుడు అనే రాక్షసుడికి మరియు కృష్ణుడికి మధ్య గొప్ప యుద్ధం ఇక్కడ జరిగిందని నమ్ముతారు. అంతేకాదు బానాసురుడి తల దేవాలయ ప్రవేశద్వారం ముందు ఖననం చేయబడిందని కూడా అంటారు.

visiting this temple will give you longer life

సరహన్‌కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కల్కా రైల్వే స్టేషన్. సిమ్లా రైల్వే స్టేషన్ నుండి సుమారు 84 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన భారతీయ పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. సరహన్‌కి చేరుకోవడానికి ఈ రైల్వే స్టేషన్ వెలుపల క్యాబ్ మరియు టాక్సీ సేవలు లభిస్తాయి. సరహన్‌ని సందర్శించాలనుకునే పర్యాటకులు రోడ్డు మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఢిల్లీ, సిమ్లా నుంచి రెగ్యులర్ బస్సు సేవలు అందుబాటులో కలవు.

Admin

Recent Posts