ఆధ్యాత్మికం

రోజూ 30 సార్లు ఓం అని ప‌ఠిస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలు ఇవే..!

ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసి,ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని నిరూపించింది..దీనికోసం తను 17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గడం గమనించింది.

అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌనః పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.

health benefits of chanting om daily for 30 times

ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి…ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.

Admin

Recent Posts