మహిళలు నాకు పుల్లగా ఏదన్నా తినాలని ఉంది అని ఎవరన్నా అనగానే ఏమన్నా విశేషమా అని అడుగుతుంటారు..నిజమే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పులుపు పదార్దాలు తినాలనిపిస్తుంటుంది.అందులోనూ ముఖ్యంగా చింతపండు,చింతకాయల పట్ల మహిళల మనసు లాగుతుంది. గర్భంతో ఉన్నప్పుడు వాంతులు,వికారం వలన చింతకాయ తినాలనిపించడం సహజ లక్షణం..కానీ చింత తినడం వలన కేవలం వాంతులు ,వికారం పోగొట్టడమే కాద దానితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చింతపండులో ఉండే విటమిన్ C గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అధిక మొత్తంలో విటమిన్ C గర్భిణుల ఆరోగ్యాన్ని చాలా విధాలుగా ప్రభావితపరుస్తుంది. గర్భిణుల శరీరంలో విటమిన్ C అధికం అవటం వలన ప్రొజెస్టరాన్ ఉత్పత్తి తగ్గుతుంది ఫలితంగా గర్భస్రావానికి కారణమవవచ్చు. గర్భిణులలో కొంత మంది రక్తంలోని చక్కెర స్థాయిలతో బాధపడుతుంటారు అవునా! కానీ చింతపండు లేదా చింతకాయలో ఉండే పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర పోషకాలు రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
గర్భిణి స్త్రీలలో మలబద్దకం అనేది చాలా సాధరణ సమస్య. ఎందుకంటే పెరిగే గర్భాశయం పేగులపై ఒత్తిడి కలిగిస్తుంది ఫలితంగా మలబద్దకం వంటి సమస్యలు కలుగుతాయి. మితంగా చింతపండు లేదా చింతకాయ తీసుకుంటే మలబద్దకం మరియు ఇతర జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గర్భిణుల శరీరంలో చేరే ఫ్రీ రాడికల్ లను నిర్వీర్యపరచటంలో చింతపండు లేదా చింతకాయ సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు శరీరంలోకి ప్రవేశించే ఫ్రీ రాడికల్ లను పుర్తిగా నివారిస్తుంది. కావున తక్కువ స్థాయిలో చింతపండు ఆరోగ్యకరమే.