ఆధ్యాత్మికం

బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఎక్క‌డా కనిపించ‌రు.. కుంభ‌మేళాకు నాగ సాధువులు ల‌క్ష‌లాదిగా ఎలా త‌ర‌లి వ‌స్తారు..?

సూక్ష్మ శరీర పరిజ్ఞానం వారి సొంతం. కాబట్టి వాళ్లు అనగా సాధువులు, నాగసాధువులు హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. మైనస్ 60 డిగ్రీ సి లో కూడా బట్టలు లేకుండా సంచరిస్తారు హిమాలయాల్లో.

కుంభమేళాలు జరుగుతున్నప్పుడు వస్తారు ఎలా వస్తారో తెలియదు ఎలా వెళ్తారో తెలియదు కానీ ఎక్కడా కూడా వాళ్ళు బస్సులు ఎక్కినట్టుగాని విమానాల్లో వచ్చినట్టుగానే ట్రైన్ లో ఎక్కినట్టుగానే రోడ్డుమీద నడిచే వెళ్లినట్టు గాని ఆధారాలు లేవు. సడన్ గా వస్తారు వారి పని పూర్తవుగానే ఒకటి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తారు తర్వాత ఎవ్వరికీ కనిపించరు అదే సూక్ష్మ శరీర జ్ఞానం.

how naga sadhu come to kumbh mela

మనం ఎన్నో సినిమాల్లో చూశాము. దేవతలు కృష్ణుడు, ఆంజనేయస్వామి, పరమేశ్వరుడు మొదలగు వారు అలాగే సూక్ష్మ శరీర ప్రయాణం చేస్తూ ఉంటారు. ద్రౌపది నిండు సభలో జూదంలో ఓడిపోయిన తర్వాత ఆమె చీరను లాగేస్తున్నప్పుడు కృష్ణ కృష్ణ నన్ను రక్షించు అని వేడుకోగానే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. కనిపించకుండానే ఆమెకు చీరలు వరుసగా అందిస్తాడు. అదే సూక్ష్మ శరీర ప్రయాణ రహస్యం. అలాగే ఆంజనేయస్వామి కూడా లక్ష్మణుడు గాయపడినప్పుడు హిమాలయాల్లో ఉన్న సంజీవిని పర్వతంలో ఉన్న సంజీవని వృక్షం కోసం సూక్ష్మ శరీర జ్ఞానంతో ప్రయాణించి ఆ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని రక్షిస్తాడు. ఈ విధంగానే నాగ సాధువులు కూడా ప్ర‌యాణిస్తార‌ట‌. అయితే ఇందుకు కూడా ఆధారాలు లేవు.

Admin

Recent Posts