ఆధ్యాత్మికం

హిందూ మ‌తంలో కుమారులు మాత్ర‌మే త‌ల్లిదండ్రుల‌కు ఎందుకు అంత్య‌క్రియ‌లు చేస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ మతంలో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి&period; అందులో ఒకటి అంత్యక్రియలు చేసే బాధ్యత కుమారుడికి ఉండటం&period; ఇప్పుడంటే మహిళలు కూడా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తున్నారు&period; కానీ ఒకప్పుడు కచ్చితంగా కుమారుడు మాత్రమే చేయాలని పట్టుబట్టేవారు&period; కొడుకులు లేనివారు వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు&period; అయితే కొడుకులు మాత్రమే అంత్యక్రియలు చేయాలనే నియమం వెనక చాలా కారణాలు ఉన్నాయి&period; నిజానికి హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి&period; హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి చెందిన కుమారుడు మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతారు&period; మహిళలు అంత్యక్రియలు నిర్వహించడం అంటేనే కాస్త ఆలోచనల్లో పడతారు&period; దీనికి గల కారణాన్ని ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రాలలో పేర్కొన్న సమాచారం ప్రకారం అంత్యక్రియల సమయంలో చేసే అన్ని కర్మలు కొడుకు చేత నిర్వహిస్తారు&period; కొడుకులు మాత్రమే ఎందుకు కుమార్తెలు చేయెుచ్చు కదా అని మీరు అడుగుతారేమో&period; దీనికి సమాధానం వేదాలలో కూడా ఉంది&period; పుత్ర అనే పదం రెండు అక్షరాలతో ఉంటుంది&period; పు అంటే నరకం&comma; త్ర‌ అంటే జీవితం&period; దీని ప్రకారం కొడుకు అంటే నరకం నుండి విముక్తి కలిగించేవాడు&period; అనగా తండ్రి లేదా తల్లిని నరకం నుండి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేవాడు&period; అందుకే పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే సామెత కూడా ప్రచారంలో ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91767 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;cremation&period;jpg" alt&equals;"why only sons will do cremation in hindu religion " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి కారణాలతో అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి కొడుకుకు హక్కులు ఉంటాయి&period; అదే సమయంలో&comma; దీని వెనుక ఉన్న మరొక కారణం ఏమిటంటే స్త్రీ లక్ష్మీ స్వరూపం అయినట్టే&comma; కొడుకు కూడా విష్ణువు అంశగా పరిగణిస్తారు&period; ఇక్కడ విష్ణువు అంటే పోషణ అని అర్థం&period; అంటే కుటుంబ సభ్యులందరినీ చూసుకునే వ్యక్తి కొడుకు&period; ఇంటి పెద్ద దిక్కు మరణించిన తర్వాత అన్ని బాధ్యతలు అతడి మీదే ఉంటాయి&period; అయితే ఇప్పుడు మహిళలు కూడా ఈ బాధ్యతను తీసుకోగలుగుతున్నారు&period; ఈ అంత్యక్రియల ఆచార నియమాలు మెుదలైనప్పుడు మహిళలు కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యాన్ని కలిగి లేరని కొందరూ చెబుతారు&period; అందుకే ఇలాంటి ప్రత్యేక హక్కులు లేవు&period; కానీ నేటి కాలంలో ఆడపిల్లలు కూడా అంత్యక్రియలు చేస్తున్నారు&period; ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత వారు ఇంటి బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు&period; అయినప్పటికీ ఈ ఆచారం ఇప్పటికీ చాలా గృహాలలో ఉంది&period; అందుకే కుమారులు మాత్రమే అంత్యక్రియలు చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts