మనం ఏదైనా ఆలయానికి వెళితే అక్కడ మనకు స్వామి వారి కుంకుమతోపాటు విభూది కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఉండే కుంకుమ, విభూదిని తీసుకుని నుదుటిపై పెట్టుకుంటారు. అయితే ఆలయంలో ఉన్న విభూదిని, లేదా ఇంటిలో విభూదిని ఒక్కో వేలుతో పెట్టుకోవడం వల్ల ఒక్కో విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి విభూదిని ఏ వేలితో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా విభూదిని మనం బొటనవేలితో నుదుటిపై పెట్టుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అదేవిధంగా చూపుడు వేలితో నుదిటిపై విభూది పెట్టుకుంటే మన ఇంట్లో వస్తువుల నాశనం జరుగుతుంది. మధ్యవేలుతో విభూదిని నుదుటిపై పెట్టుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.
ఉంగరపు వేలుతో నుదిటిపై విభూతిని పెట్టుకోవడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక చిటికిన వేలితో విభూదిని నుదుటిపై పెట్టుకుంటే గ్రహదోషాలు తప్పవని పండితులు చెబుతున్నారు. కనుక ఇంట్లో లేదా ఆలయానికి వెళ్ళిన భక్తులు విభూదిని బొటనవేలు, ఉంగరపు వేలుతో కలిపి తీసుకుని ఉంగరపు వేలుతో పెట్టుకోవటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం చేపట్టిన కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మధ్యవేలుతోనూ విభూదిని పెట్టుకోవచ్చు. కానీ ఇతర వేళ్లతో విభూదిని పెట్టుకోరాదు.