lifestyle

Coconut Water : కొబ్బ‌రి నీళ్ల‌ను త‌ర‌చూ తాగుతున్నారా.. అయితే ముందు ఈ నిజాల‌ను తెలుసుకోవాల్సిందే..!

Coconut Water : వేస‌వి వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రోజూ మండిపోతున్న ఎండ‌ల‌కు జ‌నాలు అల్లాడిపోతున్నారు. దీంతో వేస‌వి తాపం చ‌ల్లారేందుకు వారు ర‌క ర‌కాల మార్గాలు అనుస‌రిస్తున్నారు. అయితే ఎండ వేడిని త‌ట్టుకునేందుకు చాలా మంది ఆశ్ర‌యిస్తున్న ముఖ్య‌మైన ఒక మార్గం.. కొబ్బ‌రినీళ్లు. వాటిని తాగితే చాలు వేస‌వి తాపం ఇట్టే పోతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ద్ర‌వాలు అందుతాయి. దాహం తీరుతుంది. అయితే కేవ‌లం దాహం తీర్చేందుకే కాక ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే గుణాలు కూడా కొబ్బ‌రి నీళ్ల‌లో ఉన్నాయి. వీటిని ఈ సీజన్‌లో రోజూ తాగ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లల్లో ప్రొటీన్లు, కొవ్వు, పిండిపదార్థాలు, డైటరీ ఫైబర్‌లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి మినరల్స్ ఉంటాయి. అలాగే విటమిన్‌-సి, బి6, ఇ, కె, థ‌యామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలేట్‌ వంటి పోష‌కాలు కొబ్బ‌రి నీళ్ల‌లో స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి వేస‌విలో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల‌ను అందిస్తాయి. శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరినీళ్లు ఎలక్ట్రోలైట్స్‌గా పనిచేస్తాయి. శరీరంలోని నీటి పరిమాణాన్ని సమతుల్యం చేస్తాయి. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వచ్చు. గ్యాస్ట్రోఎంటరైటిస్‌, వాంతులు, నీళ్ల విరేచనాలను తగ్గించ‌డంలో కొబ్బ‌రి నీళ్లు అమోఘంగా ప‌నిచేస్తాయి. కొబ్బరి నీళ్లల్లో యాంటీ ఇన్ఫెక్టివ్‌ గుణాలుండడం వల్ల ప‌లురకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

if you are drinking coconut water regularly then know this

లేత కొబ్బరి బొండాంలోని నీళ్లు కలరాకు అడ్డుక‌ట్ట వేస్తాయి. రెండు గ్లాసుల కొబ్బరినీళ్లల్లో నాలుగు టీస్పూన్ల నిమ్మరసం వేసి తాగితే ఎంతో మంచిది. ఈ మిశ్ర‌మం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ సమతుల్యమవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొబ్బరినీళ్లు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రక్తపోటును త‌గ్గిస్తాయి. కొబ్బరినీళ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి.

పోస్ట్‌ మెనోపాజల్‌ సింప్టమ్స్‌ను తగ్గించడంలో కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. గాయాల తీవ్రతను తగ్గిస్తాయి. గాయాలు త్వ‌ర‌గా మానేలా చేస్తాయి. బ్లడ్‌ షుగర్ స్థాయిల‌ను బ్యాలెన్స్‌ చేయడమేగాక రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే లక్షణాలు ఈ నీళ్లకు ఉంటాయి. కొబ్బరి నీళ్లు కొవ్వును కరిగించడమేగాక బరువును తగ్గిస్తాయి. క‌నుక ఈ నీళ్ల‌ను త‌ర‌చూ తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts