ఆధ్యాత్మికం

Rama Koti : రామ‌కోటి ఎందుకు రాయాలి..? ఏ పెన్ తో రాస్తే మంచి జ‌రుగుతుంది..? నియ‌మాలు ఏమిటి..?

Rama Koti : రాముడి పేరును అక్ష‌ర‌రూపంలో జ‌పించ‌డ‌మే రామ‌కోటి. మ‌న‌సా వాచా క‌ర్మేణ రాముడిని స్తుతిస్తూ ఆ మ‌ధుర‌నామాన్ని కోటి సార్లు రాయ‌డ‌మే రామ‌కోటి. శ్రీమ‌న్నారాయ‌ణుడి అన్ని రూపాల్లో రామావ‌తారమే చాలా ప్రాముఖ్య‌త పొందింది, రాముడిని ప్ర‌తి ఒక్క‌రూ మా దేవుడు అనుకునేంత‌గా ద‌గ్గ‌ర‌య్యాడు. అతీత శ‌క్తుల కంటే కూడానూ రాముడు చూపిన ఆద‌ర్శ‌వంత‌మైన జీవిత‌మే చాలా మందిని రాముడు అంటే ఓ ప్ర‌త్యేక‌మైన ఇష్టాన్ని, భ‌క్తిని ఏర్ప‌రిచింది.

శ్లోకం..

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్‌.

తాత్ప‌ర్యం..

రఘువంశ ప్రభువైన శ్రీరామచంద్రుని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో వున్నది. ఆ శ్లోకాలలో ఉన్న ఏ ఒక్క అక్షరమైనా మనయొక్క మహాపాపాలను సైతం పరిహరిస్తుంది.

how to write rama koti what are the benefits

రామకోటిని రాయడానికి ఉపక్రమించే ముందు సాధారణంగా ఈ కింది నియమాలు పాటిస్తారు.

నిర్మ‌ల‌మైన మ‌నస్సుతో రాయాలి. రాసేటప్పుడు దిక్కులు చూస్తూనో అనవసరమైన మాటలు మాట్లాడటమో చేయకూడదు. నేలపై పడుకుని రాయకూడదు. నల్లరంగులో రాయకూడదు. ఆకు పచ్చ రంగు పెన్ తో రాయ‌డం చాలా మంచిది. పద్మాసనం వేసుకుని కూర్చుని రాయాలి. అంటు, మైల, పురుడు ఉన్న రోజులలో రాయకూడదు. రామకోటిని రాయ‌డం పునర్వసు నక్షత్రం నాడు ప్రారంభించి అదే నక్షత్రం రోజు ముగిస్తే మంచిది. పూర్తి చేసిన రోజు అన్న సంతర్పణ చేయడం మంచిది. సాయంకాలం స్నానం చేసి భోజనానికి ముందు రాయడం మంచి పద్ధతి.

సైంటిఫిక్ ఉప‌యోగాలు..

ఒకే ప‌దాన్ని ప‌లుమార్లు రాయ‌డం వ‌ల్ల ఏకాగ్ర‌తాశ‌క్తి పెరుగుతూ ఉంటుంది. ఓపిక, స‌హ‌నం లాంటి గుణాలు అల‌వ‌డుతాయి. మ‌నస్సుకు ప్ర‌శాంతత‌ చేకూరుతుంది. ఒక పాజిటివ్ ఎన‌ర్జీ ఉండ‌డం వ‌ల్ల చేయాల్సిన ప‌ని స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం వ‌స్తుంది.

Share
Admin

Recent Posts