సాధారణంగా మనం పూజ చేయడం కోసం వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తాము. రంగు రంగు పువ్వులతో సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ దేవ దేవతలకు పూజ చేయడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే కొన్ని పువ్వులు కొంతమంది దేవుళ్లకు ఎంతో ప్రీతికరం. అదేవిధంగా మరికొన్ని పుష్పాలతో ఇతర దేవుళ్లకు పూజలు అస్సలు చేయకూడదు.
భారతీయ సంప్రదాయాల ప్రకారం దుర్గమాత పూజకి ఎటువంటి పరిస్థితులలో కూడా జిల్లేడు, నందివర్ధనం, పారిజాత పుష్పాలు, నాగ చంపా, బృహస్పతి, తంగేడు వంటి పువ్వులతో పూజ చేయకూడదు. ఈ విధమైన పువ్వులతో పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం కలగడం ఏమోగానీ అమ్మ వారి ఆగ్రహానికి లోనవుతారని పండితులు చెబుతున్నారు.
దుర్గ మాతకు ఎంతో ప్రీతికరమైన తంగేడు పుష్పాలు, సంపెంగ పువ్వులతో పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అదే విధంగా అమ్మవారి పూజకు గంటను కూడా ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.