ఆధ్యాత్మికం

Lakshmi Devi : అప్పుల బాధల నుంచి విముక్తులు అవ్వాలంటే.. ఇలా చేయాలి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది..!

Lakshmi Devi : జీవితం అన్నాక ఏ మనిషికి అయినా సరే ఒడిదుడుకులు సహజం. కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, సంతోషాలు ఉంటాయి. అలాగే లాభాలు, నష్టాలు ఉంటాయి. చాలా మంది అప్పులతో సహవాసం చేస్తుంటారు. అప్పు లేని మనిషి ఉండడు.. అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పులు మరీ ఎక్కువగా ఉన్నవారు.. ఎంత తీర్చినా అప్పుల నుంచి అసలు బయట పడలేకపోతున్నవారు.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఆమె అనుగ్రహం పొందాలి. దీంతో అప్పుల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు గాను కింద తెలిపిన సూచనలను పాటించాలి.

అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు రోజూ స్ఫటిక రూపంలో ఉండే గణపతిని పూజించాలి. ఆ గణపతిని పూజ గదిలో లేదా మందిరంలో ఉంచి పూజలు చేస్తుండాలి. దీంతో ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు.

to get Lakshmi Devi blessings do like this

మహిళలు లక్ష్మీదేవి బొమ్మ ఉండే గొలుసును ధరించాలి. అలాగే కుడి చేతి ఉంగరం వేలికి లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించాలి. దీంతో ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. అలాగే బంగారం లేదా వెండి లేదా కంచుతో లక్ష్మీదేవి విగ్రహాన్ని స్థోమతకు అనుగుణంగా తయారు చేయించి రోజూ పూజ చేయాలి. ఇలా 20 శుక్రవారాలు చేయాలి. దీంతో తప్పక ఫలితం ఉంటుంది.

స్నేహితులకు వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని దానం చేయాలి. మహిళలు తమ పుట్టింటి నుంచి రెండు ప్రమిదలను తెచ్చి అందులో నూనె వేసి దీపాలను వెలిగించి లక్ష్మీ దేవికి ప్రతి శుక్రవారం పూజ చేయాలి.

ఇక చీమలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో గురువారం నాడు కనీసం ఒక కిలో చక్కెరను చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అప్పుల బాధల నుంచి విముక్తులు అవుతారు.

Admin

Recent Posts