ఆధ్యాత్మికం

పాము భయం వెంటాడుతోందా..? ఈ క్షేత్రాన్ని దర్శించాల్సిందే..!

పాములను చూస్తే కొందరు ఎంతో భయంతో ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు పాము అనే పేరు వినగానే తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. కలలోనూ కొందరికి పాములు కనిపిస్తుంటాయి. ఈ విధంగా పాము అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పాము భయం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే భయం తొలగిపోతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 10 కి.మీ దూరంలో కుడుపు అనే గ్రామం ఉంది. కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అనే అర్థం వస్తుంది. ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి పాము ఆకృతిలో ఉండే ఐదు తలలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎవరినైతే పాము భయం వెంటాడుతుందో అలాంటి వారు ఈ ఆలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల వారికి పాము నుంచి కలిగే భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

if you fear about snakes then visit this temple

ఈ క్రమంలోనే ప్రతి సోమవారంతోపాటు శ్రావణ మాసంలోని 5వ రోజు వచ్చే నాగపంచమికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకొని అనంతపద్మనాభ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో ఈ గ్రామంలోని మహిళలు ఆవు పేడ, ఆవు పాలను కలిపి తమ ఇంటి గోడలపై పాము చిత్రాలను గీస్తారు.

ఈ విధంగా పాము బొమ్మలు గీయటం వల్ల వారికి పాము కాటు వేయదని అక్కడి ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే పాము భయం ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల పాము భయం పూర్తిగా తొలగిపోతుందని విశ్వసిస్తారు.

Admin

Recent Posts