అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె అందంకి ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె బయటక కనిపిస్తే చాలు అభిమానులు తెగ ఎగబడిపోతుంటారు. సెలబ్రిటీలు సైతం ఆమెతో ఒక్క ఫొటో అయిన దిగాలని తహతహలాడుతుంటారు. అయితే ఐశ్వర్యరాయ్ బయటకి వచ్చినప్పుడల్లా పబ్లిక్‌తో కొంత ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది కాబట్టి రక్షణగా బాడీగార్డ్స్‌ని నియమించుకుంది. ఆయనలో ముఖ్యుడు శివరాజ్. బచ్చన్ కుటుంబానికి సెక్యూరిటీగా కొన్నాళ్ల నుండి పని చేస్తున్నాడు. 2015లో, ఐశ్వర్య రాయ్ తన బాడీగార్డ్, శివరాజ్ వివాహానికి హాజరయ్యారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పాపులారిటీ తెలిసి కూడా ఐశ్వర్య పెళ్లికి వచ్చి తన బాడీగార్డ్ పెళ్లికి హాజరై అందరి హృదయాలను గెలుచుకుంది.
ఐశ్వర్య రాయ్ ఇంటి బయట అడుగు పెట్టడం మనం చాలా అరుదుగా చూస్తాము, కానీ ఆమె ఇంటి నుండి బయట అడుగు పెట్టగానే శివరాజ్ డ్యూటీ ప్రారంభమవుతుంది. శివరాజ్ ఐశ్వర్య రాయ్ పక్కన ఉంటే, ఆమెను ఎవరూ తాకడానికి అనుమతించరని మీడియా నివేదికలు చెబుతున్నాయి. శివరాజ్ టెక్నికల్ ఎక్స్ పర్ట్ అని కూడా అంటున్నారు. కొన్నేళ్లుగా శివరాజ్ బచ్చన్ ఫ్యామిలీ కోసం పని చేస్తుండగా, ఆయనకి లక్షల రూపాయల జీతం ఇస్తారనే టాక్ ఉంది. ఆయన జీతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం కన్నా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్‌లలో ఒకరిగా శివరాజ్ ఉన్నారని అంటున్నారు.
మరోవైపు ఐశ్వర్యరాయ్ మామ అమితాబ్ బచ్చన్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరి ఆయనకి బాడీగార్డ్‌గా ఉంది జితేంద్ర షిండే. బిగ్ బి యొక్క దేశీయ నుండి విదేశీ పర్యటనల వరకు, జితేంద్ర అతని పక్కనే ఉంటూ అతనికి తోడుగా ఉంటాడు. అలాగే కేబీసీ సెట్ల నుంచి షూటింగ్ సెట్ల వరకు రోజంతా అమితాబ్ బచ్చన్‌ను ఆయన కాపాడుతుంటాడు. జితేంద్ర చేతిలో కార్బైన్ తుపాకీ ఉండడం మనం గమనించవచ్చు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారూఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్‌లకి కూడా బాడీగార్డ్స్ ఉండగా, వారికి కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తారనే టాక్ ఉంది.