ఆధ్యాత్మికం

ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు పిండం పెట్టడం హిందూ సాంప్రదాయం&period; మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం ముత్తాతల కాలం నుండే ఉంది&period; ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని&comma; ఒకవేళ కాకి ముట్టకపోయినట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తీర్చనందువల్ల వారు అసంతృప్తికి గురయ్యారని అనుకుంటారు&period; అలాగే కాకి మన ఇంటి పరిసరాలలో అరిస్తే ఇంటికి బంధువులు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు&period; ఇందులో నిజం ఎంతో&comma; అబద్ధం ఏంతో ఎవరికీ తెలియదు కానీ పూర్వకాలం నుంచి ఈ విషయం పరిగణన‌లో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి లేదా చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని చెబుతారు&period; అయితే కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం&quest; కాకులను ఎప్పుడు చూడడం మంచిది&quest; దీని గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; మనం ఎటైనా బయటికి వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే వారు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం&period; నీళ్లు నిండుగా ఉన్న కుండపై వాలిఉన్న కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలో ధనవంతులవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు&period; నోటితో కాకి ఏదైనా పట్టుకొని దాన్ని మనిషి పై పడేస్తే అది అశుభానికి సంకేతం&period; ఇక మాంసం ముక్కను పట్టుకువెళ్తూ కింద ఏ వ్యక్తి పైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని విశ్వాసం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89251 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;crow&period;jpg" alt&equals;"is it bad to us if crows at our home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు&period; కాకులన్నీ ఒకచోట సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చుని అరిస్తే ఆ స్థల యజమాని కానీ&comma; ఆ చుట్టు ప్రక్కల ఉన్నవారు సమస్యల్లో పడుతారు&period; ఇంటి పై కప్పు పై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతుందని అంటున్నారు&period; ఎగురుతున్నప్పుడు కాకి ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది&period; మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకుల అరుపులు వినడం శుభప్రదం అని చెబుతారు&period; విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు&period; పితృపక్షంలో కాకిని చూడడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts