ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం&period;&period; ముత్తైదువులు&comma; మహిళలకు పండగరోజు&period; అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి&period; లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి&period;&period; పసుపు &comma; ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి&period;&period; ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి&period; అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి ప్రాప్తిస్తుంది&period; అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి&period; జీవితం శుభకరంగా&comma; మంగళకరంగా&comma; సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది&period; ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబమంతా సుఖసంతోషాలతో&comma; ప్రశాంతతతో ఉంటుందని నమ్మకం&period; శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం&period; అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరస్సులో ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి&period; శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం&period; అలాగే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు&comma; యువతులు సంప్రదాయ దుస్తులు ధరించాలి&period; చీరలు&comma; లంగా ఓణీలు వేసుకుంటే&period;&period; సంప్రదాయత ఉట్టిపడుతుంది&period; నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి&period; ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద&comma; విభూదిని నుదుటి బొట్టుపైన పెట్టుకోవాలి&period; ఆలయంలో కర్పూరం వెలింగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి&period; ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో&comma; ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకునో దీపం వెలిగించడం మంచిది కాదు&period; ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా&period;&period; ఇతరులకు చేకూరుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90513 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lakshmi-devi&period;jpg" alt&equals;"lakshmi devi will bless you if you do like this on friday " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే&period;&period; గరిక మాల తీసుకెళ్లండి&period; గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే&period;&period; కోరిన కోరికలు నెరవేరుతాయి&period; శుక్రవారం శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి&comma; సర్వ శుభాలు చేకూరుతాయి&period; ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలనుకుంటే తులసీ మాల సమర్పించాలి&period; ఆంజనేయస్వామిని దర్శించుకునే వాళ్లు వెన్నముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు&comma; తెలుపు&comma; ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts