Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకాష్ నర్వస్ గానే ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాడు &period; ఆఫీస్ పోష్ గా ఉంది&period; ముగ్గురు కుర్రాళ్ళు లాప్టాప్ లు పెట్టుకుని పనిచేస్తున్నారు&period; ఒక అమ్మాయి ఫైల్ చూస్తూ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతోంది&period; ప్రకాష్ అలాగే నిలబడిపోయాడు&period; ఇంతలో అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చాడు&period; ఏం కావాలి అని ప్రకాష్ ని అడిగాడు&period; నరేంద్ర సార్ ని కలవాలి అన్నాడు ప్రకాష్&period; ఆఫీస్ బాయ్ ప్రకాష్ ని ఎగాదిగా చూసాడు&period; మాసిన బట్టలు &comma; చేయని గడ్డం&comma; పాత చెప్పులు ఇలాంటి వాళ్ళతో ప్రొప్రయిటర్ కు ఏం పనా అనుకున్నాడు&period; ఒక స్లిప్ ఇచ్చి మీ పేరు రాయండి&comma; సార్ కు చూపించి ఆయన రమ్మంటే పిలుస్తాను అన్నాడు&period; ప్రకాష్ ఆ స్లిప్ లో తన పేరు మొబైల్ నెంబర్ అలాగే క్లాస్మేట్ అని రాసి ఇచ్చాడు &period; నరేంద్ర&comma; ప్రకాష్ కలిసి కాలేజీ లో చదివారు&period; నరేంద్రకు తన జ్ఞాపకం ఉంటానో లేదో ప్రకాష్ కి డౌటే &period;ఆఫీస్ బాయ్ దాన్ని తీసుకొని లోపలికి వెళ్లి ఒక రెండు నిమిషాలలో అవతలికి వచ్చిసార్ రమ్మంటున్నారు రండి అని క్యాబిన్ కు దారి చూపించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకాష్ బెరుకుగానే లోపలికి వెళ్ళాడు&period; ప్రకాష్ వెళ్ళిన తక్షణం నరేంద్ర అతనితో కరచాలనం చేశాడు &period; ఎలా ఉన్నావు ప్రకాష్ చాలా దినాలు అయింది కనపడి అని ఆప్యాయంగా పలకరించాడు&period; ప్రకాష్ కు బెరుకు తగ్గింది&period; ఇద్దరు తమ కాలేజ్ దినాల గురించి మాట్లాడుకున్నారు&period; నరేంద్ర ప్రకాష్ వాడిపోయిన మొహం చూసిప్రకాష్ నువ్వు టిఫిన్ చెయ్యి నేను తెప్పిస్తాను అని అన్నాడు&period; ప్రకాష్ వద్దు అనబోయాడు కానీ కడుపులో వేస్తున్న ఆకలి అతన్ని ఊరికనే ఉండమని ప్రేరేపించింది&period; ఆఫీస్ బాయ్ దోసె ఇడ్లీ టీ తెచ్చాడు&period; నరేంద్ర ప్రకాష్ కి తినమని చెప్పాడు&period; తనది బ్రేక్ఫాస్ట్ అయిందని తను ఏమి తీసుకోడని చెప్పాడు&period; మొహమాటపడుతూనే ప్రకాష్ అన్నిటిని తిని రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు&period; తర్వాత నరేంద్రకు థాంక్స్ చెప్పాడు&period; నరేంద్ర&period;&period; ప్రకాష్ నా నుంచి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు&period; ప్రకాష్ చెప్పాడు నాకు ఇప్పుడు సరి ఐన ఉద్యోగం లేదు&comma; అక్కడ ఇక్కడ చిన్నాచితక ఉద్యోగాలు చేస్తున్నాను&period; ఫాదర్ రిటైర్ అయ్యారు&period; ఆయన పెన్షన్ డబ్బులు ఆయన మందులకే సరిపోదు&period; అన్నిటికీ కష్టమే&period;&period; అని తన గోడు వెళ్లబోసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90532 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;story&period;jpg" alt&equals;"not all who help you are friends story tells " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌రేంద్ర&period;&period; ప్రకాష్ డోంట్ వర్రీ&comma; నేను మా ఫ్రెండ్ కంపెనీలో మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని అప్పుడే ప్రకాష్ ఎదురుగానే తన ఫ్రెండ్ తో మాట్లాడాడు&period; తర్వాత ప్రకాష్ కు రేపు పొద్దున వెళ్ళు&comma; అక్కడ మీకు ఉద్యోగం ఇస్తాడు నా ఫ్రెండ్ అని చెప్పాడు&period; ప్రకాష్ ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు&period; నరేంద్ర ప్రకాష్ చేతికి డబ్బు ఇచ్చి దీనితో మొదట నీకున్న అప్పులు తీర్చి వెయ్యి&comma; తర్వాత మంచి డ్రెస్ కొనుక్కో&period; నువ్వు జాయిన్ అయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి అని చెప్పాడు&period; ప్రకాష్ మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి వెళ్ళాడు&period; నరేంద్ర ఇచ్చిన డబ్బుతో ప్రకాష్ అప్పులు తీర్చేశాడు&period; తల్లిదండ్రులు కూడా కుదుటపడ్డారు&period; నరేంద్ర ప్రకాష్ కు తన పాత బైక్ ఇచ్చి దాన్ని ఆఫీస్ కు వెళ్లడానికి వాడుకోమని చెప్పాడు &period; తర్వాత ఒక దినం ప్రకాష్ ని ఆఫీస్ కు పిలిచాడు&period; అక్కడ కూర్చున్న ఒక అతనితో పరిచయం చేసి ప్రకాష్ ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్&comma; నీ తల్లిదండ్రుల పేరు మీదుగా ఐదు లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను&comma; నీ పేరు మీదుగా 50 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను&period; ప్రీమియం నేనే కడతాను&period;&period; అని చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకాష్ ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు&period; ఎంతో కృతజ్ఞతగా నరేంద్రకు నమస్కారం చేశాడు &period;తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు&period; నరేంద్ర&period;&period; నేను స్నేహానికి నేను చాలా విలువ ఇస్తాను ప్రకాష్&comma; నా స్నేహితుడికి సహాయం చేయడం నాకు దేవుడిచ్చిన మంచి అవకాశం గా భావిస్తాను&period;&period; అన్నాడు&period; ఇలాగే కొన్ని నెలలు గడిచాయి ఒకదినం సాయంకాలం ప్రకాష్ ఆఫీస్ నుంచి వస్తున్నాడు&period; అప్పుడు సడన్‌గా ఒక కారు వెనుక నుంచి వచ్చి ప్రకాష్ వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది&period; అంత దూరాన ఎగిరి పడిపోయాడు ప్రకాష్&period; వెనుకగా వస్తున్న లారీ అతని మీదుగా వెళ్ళింది &period; అక్కడికక్కడే మరణించాడు ప్రకాష్&period; పోలీసులు à°µ‌చ్చారు&period; ఆంబ‌బులెన్స్ వచ్చింది &period; ప్రకాష్ వాళ్ళ తల్లిదండ్రులకు నరేంద్రకు కూడా సమాచారం తెలిసింది&period; నరేంద్ర తక్షణం వచ్చాడు&period; తనే ప్రకాష్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశాడు&period; అంత్యక్రియలు పూర్తయిని తర్వాత ఓ రెండు లక్షలు డబ్బుని ప్రకాష్ తల్లిదండ్రులకు ఇచ్చి మీరు వాడుకోండి అని చెప్పాడు&period; ప్రకాష్ తల్లిదండ్రులు కంటనీరు పెట్టుకున్నారు నరేంద్ర ఔదార్యాన్ని కొనియాడారు&period; కానీ ప్రకాష్ పేరు మీద ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ 50 లక్షలు నామినీ గా ఉన్న నరేంద్రకు వచ్చిన విషయం మాత్రం ఎవరికీ తెలియదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts