ఆధ్యాత్మికం

ఇలా చేస్తే చాలు.. శ‌ని ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు..!

జ్యోతిష్య శాస్త్రంలో శ‌నికి ఎంతటి ప్రాధాన్య‌త ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇత‌ర గ్ర‌హాల క‌న్నా శ‌ని గ్ర‌హ‌మే ఎక్కువ ప్ర‌భావాల‌ను క‌లిగిస్తాడ‌నే భావ‌న ఉంది. శ‌ని వ‌ల్ల చాలా వ‌ర‌కు న‌ష్టాలే కానీ లాభాలు అనేవి ఉండ‌వు. కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే శ‌ని ఆనుగ్ర‌హం వ‌ల్ల లాభాలు క‌లుగుతాయి. ఇక ఏలినాటి శ‌ని ఉంటే అన్నీ స‌మ‌స్య‌లే.

ప్రతి ఒక్కరికి జీవితంలో కనీసం రెండు లేదా మూడుసార్లు ఏలినాటి శని వస్తుంది. దీంతో పాటు అర్ధాష్టమ శని, అష్టమశని బాధలు వస్తుంటాయి. అయితే నిజానికి శని వల్ల పడే బాధలు అంతా ఇంతాకావు. చాలామంది ఏపనిచేసినా సక్సెస్ కారు. అంతేకాదు తీవ్రమైన నష్టాలు, బాధలు, అవమానాలు ఇలా ఎన్నో వర్ణించలేని దుర్ఘటనలు. వీటన్నింటి నివారణకు చక్కటి పరిష్కారం కాలభైరవ ఆరాధన.

lord shani's effect will be removed if you do like this

శని బాధలు ఉన్నవారు ప్రతిరోజు కాలభైరవాష్టకం రోజుకు వారి శక్తిని అనుసరించి 8 సార్లు చదువుకున్న తప్పక వారి బాధలు, శనిదోషాలు పోతాయి. ఒకవేళ ప్రతిరోజు చదవుకోవడానికి అవకాశం లేకుంటే మాసంలో ఒక‌సారి అనుకూల‌మైన రోజును పండితులు సూచించిన విధంగా చ‌దువుకోండి. దీంతో శ‌ని ప్ర‌భావం నుంచి చాలా వ‌ర‌కు త‌ప్పించుకోవ‌చ్చు.

Admin

Recent Posts