పాండవులు యమ రాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. ఈ ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంతకీ ఈ ఆలయం లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి.
పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీర్ల అద్భుత సృష్టియ.. లేదంటే దైవశక్తి కారణమా అనేది ఇప్పటికి అంతు చిక్కడం లేదు. పూరి జగన్నాథ్ ఆలయం మీద ఎప్పుడు హిందూ మతానికి సంబంధించిన జెండాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటున్నారు కదూ.. అసలు రహస్యం అందులోనే ఉంది. ఈ జండాలు ఎప్పుడైనా సరే గాలి విచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి.
20 అడుగుల ఎత్తు టన్ను బరువు ఉండే సుదర్శన చక్రం, పూరి జగన్నాథ్ ఆలయం పై బాగానే ఉంటుంది. ఈ చక్రం పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ చక్రం కనిపిస్తుంది. మీరు ఏ వైపు నుంచి చూసినా అది మీకు అభి ముఖంగానే ఉన్నట్లు కనిపించడం దీని విశిష్టత. అలాగే ఈ ఆలయంపై నుంచి విమానాలు మరియు పక్షులు వెళ్లకపోవడం ఆశ్చర్యం. దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి అంశం ఉండదు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని నో ప్లేయింగ్ జోన్లో ప్రకటించలేదు. ఏదో తెలియని శక్తి వల్ల ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుంది.