వినోదం

తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించిన.. 6 సినిమాలు ఏంటంటే..?

అన్నగారు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఒక దేవుడిలా చెప్పవచ్చు. ఆయన నటన విషయానికి వస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి. ఒకవైపు నటిస్తూనే మరోవైపు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. ఆయన నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా ప్రతిభాశాలి..

ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వరకు తన తండ్రి ఎన్టీఆర్ కనుసన్నల్లోనే ఆయనతో పాటు సినిమాల్లో చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ విజయవంతం అవడం, ఈ విధంగా బాలకృష్ణ పూర్తిస్థాయి హీరోగా పేరు తెచ్చుకునే వరకు ఆయన దర్శకత్వంలోనే సినిమాలు చేశారు. మరి ఎన్టీఆర్ దర్శకత్వం వహించి బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు చూద్దాం.

దాన వీర శూర కర్ణ :

దాన వీర శూర కర్ణ మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా పౌరాణిక కథ బేసిగ్గా తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ నటించారు.

తాతమ్మకల :

ఈ సినిమా ద్వారానే నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇందులో బాలనటుడిగా చేసి అందరినీ మెప్పించారు.

balakrishna acted in these sr ntr directed movies

అక్బర్ సలీం అనార్కలి:

ఈ సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది.

శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం:

ఈ మూవీకి కూడా బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాలయ్యకు ఎన్టీఆర్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర:

ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ నటనకు తెలుగు అభిమానులు థియేటర్లలోకి బ్రహ్మరథం పట్టారు.

బ్రహ్మశ్రీ విశ్వామిత్ర:

ఈ సినిమాకు కూడా ఎన్టీఆర్ దర్శకత్వం వహించగా, బాలకృష్ణ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది.

Admin

Recent Posts