ఏ సమస్య లేకుండా ఉండాలంటే పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలని కచ్చితంగా పాటించాలి. చాలా మంది దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఉప్పు దీపం గురించి చాలా మందికి తెలియదు. ఉప్పు దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చిన్న ప్రమిదలను ఒక దాని మీద ఒకటి పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యిని కానీ వేసి రెండు వత్తులు వేసి వెలిగించాలి. అయితే కింద వుండే దీపం కుందులో కాస్త ఉప్పుని కూడా వేయాలి. ఆ తరువాత దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత దీపం శ్లోకం చదువుకోవాలి.
ఏదైనా నైవేద్యం కింద పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి. లేదంటే కనకధార స్తోత్రం చదువుకోవచ్చు. అయితే శుక్రవారం నాడు మీరు ఈ విధంగా దీపారాధన చేసాక శనివారం నాడు ఆ ప్రమిదలో ఉప్పును తీసి, నీటిలో కలపాలి. ఒకవేళ కనుక అలా కుదరకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ప్రతి శుక్రవారం ఉప్పు మీద దీపాన్ని పెట్టడం వలన మీరు మీ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవుతుంది. ఉప్పు దీపాన్ని ఈశాన్య వైపు పెడితే మరీ మంచిది.
అలానే అనారోగ్యకరమైన వాతావరణం ఉన్న ఇల్లు, ఆఫీసు మొదలైన చోట్ల సమస్యలన్నీ పోయి సంతోషంగా మీ పనులు జరగాలంటే భోజ పత్ర యంత్రయుక్తమైన గోమాత, పంచభూత, శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదములు ఉన్న ఫోటోని పెడితే శుభాలే కలుగుతాయి. సమస్యలన్నీ పోతాయి.
నెలకి ఒకసారి ఆఫీసు ముఖద్వారానికి బుడద గుమ్మడికాయని కానీ పూజించిన కొబ్బరికాయ, ఎర్రటి వస్త్రం కడితే చాలా మంచి జరుగుతుంది. అలానే సాంబ్రాణితో ధూపం వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్ళని పోసి అందులో ఎర్రని పూలు వేసి కొంచెం పసుపు, కుంకుమ వేసి పెడితే సమస్యలు గట్టెక్కుతాయి.