Gajjela Sound : రాత్రి పూట నిద్రపోయిన తర్వాత మనకి కలలు వస్తూ ఉంటాయి. అలానే కొన్ని రకాల శబ్దాలు కూడా వినపడుతూ ఉంటాయి. రాత్రిపూట గజ్జల శబ్దం విన్పడితే ఎవరికి అయినా ఎంతో భయం వేస్తుంది. ఇదంతా పక్కన పెడితే రాత్రిపూట గజ్జల శబ్దం వినపడితే మంచిదా కాదా అనే విషయాన్నే ఈరోజు తెలుసుకుందాం.
రాత్రిపూట గజ్జల శబ్దం వినపడితే మంచిదా కాదా అనే దాని గురించి పండితులు వివరించారు. అర్ధరాత్రి 12 గంటల నుండి మూడు వరకు గజ్జల శబ్దం వినపడితే, అది ఎంతో మంచిది. శుభం మీకు కలుగుతుందని సూచిస్తుంది ఇది. కాబట్టి ఈ సమయంలో గజ్జల శబ్దం వినపడితే భయపడక్కర్లేదు.
ఈ సమయంలో గజ్జలు శబ్దం మీకు వినబడితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు దానికి అర్థం. లేదంటే కులదేవత, గ్రామ దేవత సంచరిస్తున్నట్లు దానికి అర్థం. కాబట్టి ఎప్పుడైనా మీకు ఇలాంటి శబ్దం రాత్రిపూట వినపడితే, అసలు కంగారు పడకండి.
అలానే నక్క కానీ పిల్లి కానీ ఏడుస్తున్నట్లు మీకు వినపడినట్లయితే, అది అశుభం. నక్క ఏడుస్తున్న శబ్దం రాత్రి పూట మీకు వినబడితే, కుటుంబంలో ఎవరైనా చనిపోతారని లేదంటే ప్రమాదం జరగబోతుందని దాని వెనుక అర్థం. ఇలా మనం ఇటువంటివి చూసి మంచి కలగనుందా చెడు కలగనుందా అనేది చెప్పవచ్చు.