ఆధ్యాత్మికం

Lord Hanuman : ఈ మంత్రాన్ని జ‌పిస్తే చాలు.. కోరుకున్న ఉద్యోగం వెతుక్కుంటూ వ‌స్తుంది..!

Lord Hanuman : చదువు.. చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండడం… ఎవరికైనా సరే ఇంతకంటే పెద్ద కోరికలు ఉండవు. చదువైన తర్వాత ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అందరికీ త్వరగా ఉద్యోగం రాదు. ఉద్యోగం పొందడం కోసం చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? తొందరగా కోరుకున్న ఉద్యోగం రావాలంటే ఈ విధంగా పాటించండి. త్వరగా ఉద్యోగం వస్తుంది. సెటిల్ అయిపోవచ్చు.

ఇలా కనుక మీరు ఆచరించారంటే త్వరగా మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, కాల కృత్యములు తీర్చుకుని స్నానం చేయాలి. పొడి బట్టలు వేసుకోండి మాసిన బట్టలు కట్టుకోకూడదు. ఉతికిన బట్టల్ని కట్టుకోవాలి. తెల్లటి వస్త్రాలు కట్టుకుంటే మరీ మంచిది. ఆ తర్వాత గంగ సింధూరాన్ని తీసుకుని ఆవు నెయ్యి తో తడిచేసుకుని తిలకం లాగ పెట్టుకోవాలి. దానిమీద కొంచెం కుంకుమ కూడా పెట్టుకోవాలి.

read this hanuman mantra to remove your problems

ఆ తర్వాత సీతారాముల ఫోటో కి కానీ ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ పూలని పెట్టి అలంకరించండి. దీపాన్ని వెలిగించి తమలపాకులో బెల్లాన్ని, అరటి పండ్లను కానీ ఒక ఐదు ఖర్జూరం పండ్లను కానీ పెట్టి నైవేద్యం పెట్టండి. భక్తితో పూజ చేస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఇంట్లో చేసుకోవడానికి కుదరని వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి కూడా చేసుకోవచ్చు.

దేవాలయంలో ఆంజనేయస్వామి బొమ్మ దగ్గర ఐదు అరటి పండ్లని నైవేద్యంగా పెట్టండి. తర్వాత ఐదు ప్రదక్షిణాలు కూడా చేయండి. పూజ తర్వాత ఆలయంలో ఒక దగ్గర కూర్చుని ఈ మంత్రాన్ని చదువుకోండి. ఇలా ఇంట్లో అయిన దేవాలయంలో అయినా సరే మీరు ఈ విధంగా ఆచరించవచ్చు. తప్పులేదు. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపిస్తే తప్పకుండా త్వరగా ఉద్యోగం వస్తుంది. ”త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ | హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!” ఇలా ఈ రెండూ 108 సార్లు జపిస్తే తప్పకుండా త్వరగా ఉద్యోగం వస్తుంది.

Admin

Recent Posts