ఆధ్యాత్మికం

Gold : అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పాపం అంట.. ఎందుకో తెలుసా..?

Gold : అక్షయ తృతీయ రోజు కొంచ‌మైనా పసిడి కొనుగోలు చేసే సంపద సిద్ధిస్తుందన్న నమ్మకంతో చాలా మంది ఆరోజు బంగారం కొనడం అనేది దేశంలో ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏవైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. దాంతో అప్పో సప్పో చేసి బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడం వలన బంగారం అక్షయం అవ్వడం అటుంచి అప్పుచేసి బంగారం కొనడం వలన మరిన్ని సమస్యల్లోకి వెళ్లడం జరుగుతుంది. ఇది మేం చెబుతున్నది కాదు స్వయంగా చాగంటి గారే చెప్పారు.

అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మను ఆచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే పాపం కొనుక్కోవడం అని ప్రవచించారు చాగంటి వారు. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఎవరు చెప్పారో కానీ పురాణాల్లో, శాస్త్రాల్లో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.

we should not buy gold on akshaya tritiya

ఆ రోజున బంగారం కొనుక్కోవడం పిచ్చి పని. బంగారం కొనడం వలన పాపం వృద్ధి చెందడం తప్ప ఎటువంటి లాభాలు ఉండవని చెప్పారు. మరి అక్షయ తృతీయనాడు ఏం చేయాలి అనేదానికి సమాధానం ఇచ్చారు. స్వయం పాకం, బట్టలు, గొడుగు, ద్రవ్యం అనగా డబ్బు, చెప్పుల జత లాంటివి దానం ఇవ్వాలి తప్ప.. బంగారం కొనడం వలన పాపం అక్షయం అవుతుందని చెప్పారు.

Admin

Recent Posts