Vijaya Shanti : విజయశాంతి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోలకి పోటీగా నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది విజయశాంతి. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చారు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన విజయశాంతి దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలతో ఆమె నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.
విజయశాంతి తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్ అని చెప్పాలి. తన యాక్షన్‌తో స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం అని చెప్పాలి.. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసారు. అంతేకాదు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్‌గా తన సత్తా చాటి అందరితో శభాష్ అనిపించుకుంది.
అయితే గతంలో ఆమె సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాల గురించి చెప్పి ఆశ్చర్యపరచింది. ఓ సినిమా కోసం కదులుతున్న రైలు నుండి పక్క కంపార్ట్మెంట్ కు వెళ్లాలని.. ఆ సమయంలో జస్ట్ మిస్ అయితే కింద పడేదాన్ని అని చెప్పింది. అనంతరం ఓ తమిళ సినిమా షూటింగ్ లో తనను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సన్నివేశం ఉండగా, అందులో ఆమెను తాళ్ళతో కట్టేసారట. గుడిసెకు నిప్పు పెట్టినప్పుడు గాలి ఎక్కువ వీయడంతో నిప్పు తన చీరకు అంటుకుందని చెప్పింది. అది చూసి హీరో విజయ్ కాంత్ వెంటనే లోపలికి వచ్చి తనను కాపాడారని… అలా చాలాసార్లు చావు చివరి అంచుల వరకు వెళ్లానని విజయశాంతి స్పష్టం చేసింది.