సన్నివేశం-1: 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ దురంతం చోటు చేసుకుంది. సమావేశమైన వేలాది జనాలపై, బ్రిటీష్ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయి. వందల మంది ప్రాణాలు పోయాయి…తూటాల మోత, తొక్కిసలాట…ఎక్కడ చూసిన తెగిపడిన చెప్పులు, గుట్టలుగా శవాలు….అస్తవ్యస్తం, రక్తసిక్తం. ఈ సంఘటన జరిగిన సమయంలో విద్యార్థిగా ఉన్న భగత్ సింగ్…. ఈ విషయం తెల్సుకొని….నేరుగా స్కూల్ నుండి సంఘటన స్థలానికి వచ్చాడు….
జలియన్ వాలా బాగ్ లోని భారతీయుల రక్తంతో తడిచిన మట్టిని ఓ పిడికెడు తీసుకొని ఓ క్లాత్ లో మూట కట్టి, తనతో పాటు ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ రోజు మొదలు….ప్రతి రోజూ రక్తంతో తడిచిన ఆ మట్టిని పూజించేవాడు. దానిని చూసిన ప్రతిసారి దీనికి కారణమైన వారి అంతు చూడాలని అనుకునేవాడట.!!
సన్నివేశం-2:
1929 ఏప్రిల్ 9న భగత్ సింగ్ తన ఇద్దరు అనుచరులతో కలిసి ఢిల్లీ లోని సెంట్రల్ అసెంబ్లీ పైకి బాంబులు విసిరాడు. బాంబుతో పాటు ఓ లెటర్ ను సైతం విసిరాడు భగత్ సింగ్…. పెద్దగా ప్రాణనష్టమేమీ లేదని అనుకుంటున్న అధికారులకు అక్కడే ఉన్న ఈ లెటర్ దొరికింది….. ఆ లెటర్ లో ఏముంది అంటే…..కేవలం మిమ్మల్ని భయపెట్టడానికే తక్కువ పవర్ ఉన్న బాంబులను వాడాను, ఎందుకంటే….. మనుషులను చంపడం సులభం.. కాని వారి సిద్ధాంతాలను సమాధి చేయడం అసాధ్యం. సిద్ధాంతాలు సజీవంగా ఉన్నంత కాలం గొప్ప గొప్ప సామ్రాజ్యాలు సైతం కూలిపోతాయి…ఈ ఘటనతో మీకు ఆ విషయం అర్థమై ఉంటుంది….. ఇంక్విలాబ్ జిందాబాద్.