ఆధ్యాత్మికం

Ants : చీమలకి ఆహారం పెట్టడం వలన మీకు ఎంత ఉపయోగమో తెలుసా..? ఆ బాధలే ఉండవు..!

Ants : శని వలన చాలా మంది ఎంతగానో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. జాతకునికి గోచార రీత్య జన్మరాశి నుండి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అని అంటారు. అయితే ఈ మూడు రాశుల్లో కూడా మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వలన, దీన్ని ఏలినాటి అంటారు. 12వ రాశిలో సంచరించేటప్పుడు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు, తరచు ప్రయాణాలు కలుగుతాయి. జన్మరాశిలో సంచరించేటప్పుడు భాగస్వామితో వైరం, మనశ్శాంతి లోపం, ఆరోగ్య భంగం, రుణ బాధలు ఇలాంటివన్నీ కలుగుతాయి. రెండవ రాశిలో తిరిగేటప్పుడు ఆశలు కల్పించి నిరాశ కలగడం, రుణ బాధలు, మానసిక ఆందోళన వంటి ఫలితాలు కనబడతాయి.

మొదటిసారి జీవితంలో వచ్చే ఏలినాటి శనిని మంగు శని అంటారు. రెండవసారి వచ్చే దానిని పొంగు శని అంటారు. మూడవసారి వచ్చినప్పుడు మృత్యు శని అంటారు. జన్మరాశికి నాలుగు, ఎనిమిది, పది స్థానాల్లో శని సంచరిస్తుంటే అర్ధాష్టము, అష్టమ, దశమ శని అంటారు. జన్మ రాశి నుండి నాలుగవ రాశిలో శని సంచరిస్తే, దానినే అర్ధాష్టము అని అంటారు. ఇలా జరిగినప్పుడు అశాంతి కలగడం, కుటుంబ సమస్యలు, రాజకీయ, వ్యాపారాల్లో సమస్యలు వంటివి కలుగుతూ ఉంటాయి.

what happens if you give foods to ants

అదేవిధంగా వాహన ప్రమాదాలు, తల్లికి అనారోగ్యం రావడం, స్థిరాస్తి సమస్యలు వంటివి జరుగుతాయి. అదే జన్మరాశి నుండి 8వ స్థానంలో శని తిరుగుతున్నట్లయితే అష్టమ శని అంటారు. వ్యాపార సమస్యలు, ఉద్యోగంలో ఆటంకులు రావడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. అదే విధంగా శత్రు బాధలు, ఊహించని నష్టాలు కూడా కలుగుతాయి. జన్మరాశి నుండి పదవ స్థానంలో శని తిరుగుతున్నట్లయితే దానిని దశమ శని అని అంటారు.

కోర్టు కేసులు, రాజకీయపరంగా ఇబ్బందులు, అధికారంతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటివి కలుగుతాయి. ఒకవేళ కనుక జాతక చక్రంలో శని మంచి స్థితిలో ఉండి, గోచారంలో గురుబలం ఉంటే ఏలినాటి శని ప్రభావం పెద్దగా పడదు. ఈ దోషాలు కనుక ఉన్నట్లయితే శనికి తైలాభిషేకాలు చేయడం, జపాలు చేసుకోవడం వంటివి చేస్తే మంచి కలుగుతుంది. చీమలకి పంచదార వేయడం, తేనె ఇవ్వడం వంటివి చేస్తే కూడా శని బాధలు పోతాయి. శనీశ్వరుడికి నువ్వులు, నువ్వుల నూనె, నీలం రంగు వస్త్రాలు, నల్లటి వస్త్రాలు, ఇనుము వంటివి ఇష్టం. క‌నుక వీటిని కూడా దానం ఇవ్వ‌వ‌చ్చు. దీంతో శ‌ని బాధ‌లు త‌ప్పుతాయి.

Admin

Recent Posts