ఆధ్యాత్మికం

Mouna Vratham : మౌనవ్రతం అంటే ఏమిటి..? ఎలాంటి లాభాలు కలుగుతాయి..?

Mouna Vratham : చాలా మంది మౌనవ్రతం చేస్తూ ఉంటారు. మౌనవ్రతం ఎందుకు చేయాలి..? మౌనవ్రతం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? అయితే, నిజానికి మౌనవ్రతం ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. అసలు మౌన వ్రతం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మౌనం అంటే, ముని యొక్క వృత్తి. మునులు ఆచరించే విధానం అని అర్థం. మునీశ్వరులు ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటించేవారు. కాబట్టి ముని అనే పేరు వచ్చింది.

మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే, వీటన్నింటికీ మౌనాన్ని ఇవ్వడం మౌనవ్ర‌తాన్ని ఆచరించడం అంటే. దశ ఇంద్రియాలు కూడా ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి. అప్పుడే పూర్తిగా మౌనం పాటించడం. నిజమైన మౌన వ్రతం చేసినప్పుడు అందుకే ద్రవాహార పదార్థాలను తీసుకోవాలంటారు. నిష్టగా ఒక్క క్షణం మౌన వ్రతం చేసినా సరే చాలు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఇది మనిషికి ఎంతో మేలుని కలిగిస్తుంది.

what is mouna vratham and what are its benefits

మౌనవ్రతం చేయడం వలన వాక్ బుద్ది, వాక్ శుద్ధి పెరుగుతాయి. ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే, ప్రశాంతంగా ఉండొచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మౌనవ్రతం చేయడం వలన శరీరానికి హీలింగ్ పవర్ పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా శరీరం పని చేస్తుంది. దీని వలన కోపం తగ్గుతుంది. రోగాలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

మనసులో ప్రశాంతత కలుగుతుంది. కొంచెం సేపు పాటించినా, అనవసరమైన గొడవలు ఏమీ ఉండవు. చాలా మటుకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మౌనవ్రతం ఉండడం వలన ఇలా అనేక లాభాలని పొందొచ్చు. ఆరోగ్యాన్ని కూడా మరింత పెంపొందించుకోవచ్చు. అయితే, ఈ రోజుల్లో మౌనవ్రతం అంటే ఏమిటో చాలామందికి తెలియడం లేదు. కానీ ఇన్ని లాభాల‌ని మౌనవ్రతం వలన పొందవచ్చు. కాబట్టి, అప్పుడప్పుడూ పాటించడం మంచిదే. వారానికి ఒక రోజైనా మౌనవ్ర‌తం చేయడం వలన ఈ చక్కటి లాభాలని పొంది, మనం ఎంతో ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించొచ్చు.

Admin

Recent Posts