ఆధ్యాత్మికం

పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు ధరిస్తారో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు లేదా నోములు, వ్రతాలు చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకోవడం చూస్తుంటాము.అదేవిధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా చేతికి కంకణం కడతారు. అయితే ఈ విధంగా చేతికి కంకణం కట్టడానికి గల కారణం ఏమిటి? కంకణం కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా సుదర్శన భగవానుడు కంకణానికి అధిపతి. మనం చేతికి కట్టుకున్న కంకణం మనం చేసే పనులను, ఆలోచనలను తరచు గుర్తు చేస్తూ ఉంటుంది. కంకణం కట్టుకోవడం అనేది ఆయా పూజని బట్టి ఉంటుంది. ఎక్కువగా మూడు లేదా ఐదు పోగుల దారమునుకి పసుపు రాసి తమలపాకు కట్టి దానిని కంకణం మాదిరి కట్టుకుంటాము.

why people wear kankanam during pooja

చేతికి కంకణం కట్టుకునే సమయంలో చేతిలో ఏదైనా పుష్పాన్ని లేదా పండు పట్టుకొని కట్టుకోవాలి. ముఖ్యంగా కొబ్బరికాయను చేతిలో పట్టుకుని కంకణం కడతారు. కంకణం చేతికి కట్టుకునేటప్పుడు మనలో దృఢమైన సంకల్పం ఉండాలి. చేతికి కంకణం కట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆడవారు కంకణాన్ని ఎడమ చేతికి మగవారి కుడిచేతికి కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts