ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పుణ్యక్షేత్రాల్లోకి&comma; గుళ్లలోకి&comma; దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట&period; చిన్న గుడిలో అయినా&period;&period; గంట ఖచ్చితంగా ఉంటుంది&period; దేవుణ్ని స్మరించుకుంటూ&period;&period; గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి&&num;8230&semi; గంట కొట్టడం భక్తులకు అలవాటు &period; గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు&period; అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు&period; అసలు గంట ఎందుకు కొడతారు &quest; అనే సందేహం చాలా మందికి ఉంటుంది&period;&period; ఆలయ గంటలో అనేక అర్థాలు&comma; పరమార్థాలున్నాయి&period; దుష్టశక్తులను దూరం చేసే శక్తి గంటలలో ఉంది&period; అలాగే దేవాలయంలో గంట మోగిస్తే&period;&period; సకల శుభాలకు సంకేతంగా భావిస్తారు&period; ప్రత్యేక పూజల సమయంలో గంట కొడితే&period;&period; మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గంటలో ప్రతి భాగానికి చాలా ప్రత్యేకత ఇమిడి ఉంది&period; గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని&comma; గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు&comma; కడుపు భాగంలో రుద్రుడు&comma; కొనభాగంలో వాసుకి&comma; పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని&period;&period; అందుకే గంటను దైవస్వరూపంగా భావిస్తారు&period; అలాగే పిడిభాగం గరుడ&comma; చక్ర&comma; హనుమ&comma; నంది మూర్తులతో దర్శనమిస్తుంది&period; కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది&period; ఈ నాదం మనలోని చింతలు&comma; సమస్యలను తొలగించి&comma; మనసుని దేవుడిపై ఆధ్యాత్మిక భావన కలిగేలా చేస్తుంది&period; అలాగే గంట కొట్టడం వల్ల నలుదిక్కులా ఆ శబ్ధం వ్యాపించి దుష్టశక్తులను దూరంగా తరిమే శక్తి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90681 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bell&period;jpg" alt&equals;"what is the use with bells in temples " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ఆలయాల్లో గుత్తులు&comma; గుత్తులుగా ఒకేతాడుకి కొన్ని గంటలను తగిలించి ఉంటుంది&period; అయితే ఈ గంటలు అలంకారప్రాయమే కానీ&period;&period; ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు&period; అలాగే హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అన్న సందేహం చాలా మందికి రావచ్చు&period; దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి హారతి సమయంలో గంట కొడతారు&period; అంటే&period;&period; ఆలయంలో దేవుడి విగ్రహంలోకి సకలదేవతలను ఆహ్వానించడం&period; అందుకే&period;&period; హారతి సమయంలో&period;&period; ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు&period; కాబట్టి హారతి ఇచ్చే సమయంలో కళ్లు మూసుకోకుండా&period;&period; దేవుడిని ప్రత్యక్ష దైవాంశ రూపంగా దర్శించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts