Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

Admin by Admin
July 5, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్లలోకి, దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట. చిన్న గుడిలో అయినా.. గంట ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ని స్మరించుకుంటూ.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి… గంట కొట్టడం భక్తులకు అలవాటు . గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు. అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారు ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. ఆలయ గంటలో అనేక అర్థాలు, పరమార్థాలున్నాయి. దుష్టశక్తులను దూరం చేసే శక్తి గంటలలో ఉంది. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే.. సకల శుభాలకు సంకేతంగా భావిస్తారు. ప్రత్యేక పూజల సమయంలో గంట కొడితే.. మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది.

గంటలో ప్రతి భాగానికి చాలా ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని.. అందుకే గంటను దైవస్వరూపంగా భావిస్తారు. అలాగే పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో దర్శనమిస్తుంది. కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది. ఈ నాదం మనలోని చింతలు, సమస్యలను తొలగించి, మనసుని దేవుడిపై ఆధ్యాత్మిక భావన కలిగేలా చేస్తుంది. అలాగే గంట కొట్టడం వల్ల నలుదిక్కులా ఆ శబ్ధం వ్యాపించి దుష్టశక్తులను దూరంగా తరిమే శక్తి ఉంటుంది.

what is the use with bells in temples

కొన్ని ఆలయాల్లో గుత్తులు, గుత్తులుగా ఒకేతాడుకి కొన్ని గంటలను తగిలించి ఉంటుంది. అయితే ఈ గంటలు అలంకారప్రాయమే కానీ.. ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు. అలాగే హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అన్న సందేహం చాలా మందికి రావచ్చు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి హారతి సమయంలో గంట కొడతారు. అంటే.. ఆలయంలో దేవుడి విగ్రహంలోకి సకలదేవతలను ఆహ్వానించడం. అందుకే.. హారతి సమయంలో.. ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. కాబట్టి హారతి ఇచ్చే సమయంలో కళ్లు మూసుకోకుండా.. దేవుడిని ప్రత్యక్ష దైవాంశ రూపంగా దర్శించాలి.

Tags: bellstemples
Previous Post

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

Next Post

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.