ఆధ్యాత్మికం

ఆలయంలో ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలను ఏం చేయాలో తెలుసా ?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. ఈ విధంగా ఆలయానికి వెళ్ళిన భక్తులకు స్వామివారికి అలంకరించిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు. అయితే భక్తులు ఈ పువ్వులను ఏం చేయాలి ? అంటే.. ఈ పుష్పాలను పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదు. మరి ఆ పుష్పాలను ఎక్కడ పెట్టకూడదు.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..

ఏదైనా ఆలయంలో లేదా మన పూజ గదిలో నుంచి స్వామివారికి పూజ చేసిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు. పువ్వులను ఎల్లప్పుడూ మనకు దగ్గరగా అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలు ఎల్లప్పుడూ మన దగ్గర పెట్టుకుంటే మనకు చెడు శక్తులు సమీపించకుండా ఈ పుష్పాలు రక్షణ కవచంగా ఉంటాయి.

what to do with flowers given in temple

చాలామంది మహిళలు స్వామి వారి దగ్గర నుంచి ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలను తలలో పెట్టుకుని కొద్దిసేపటికి వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. పొరపాటున కూడా ఈ విధంగా పుష్పాలను అలా పడేయకూడదని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా ప్రసాదంగా ఇచ్చిన పువ్వులను ఒక పవిత్రమైన ప్రదేశంలో, ఎవరూ నడవని, తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. ముఖ్యంగా వివాహితులు స్వామి వారి సన్నిధిలో తీసుకున్న పుష్పాలను పెట్టుకొని పొరపాటున కూడా పడకగదికి వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది. స్వామి వారికి ఎంతో పవిత్రంగా భావించి అలంకరించిన పుష్పాలను ప్రసాదంగా తీసుకున్నప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Admin

Recent Posts