ఆధ్యాత్మికం

ఏయే ప‌నులు చేసేట‌ప్పుడు ఏయే దేవ‌త‌ల‌ను త‌ల‌చుకుంటే మంచిది..?

సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.

ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు “కనకధారా స్తోత్రం” రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ ” హయగ్రీవ స్తోత్రం” పిల్లలతో చదివించాలి. అలాగే “సరస్వతి ద్వాదశ నామాలు” చదువుకోమనాలి. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు ” విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలి. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు “గోపాల స్తోత్రం ” చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.

which god we have to do pooja for which work

ఇక వివాహానికి “లక్ష్మీ అష్టోత్తర పారాయణం” చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని,పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారు. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయి.

Admin

Recent Posts