Rudraksha: రుద్రాక్షలను ధరించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రుద్రాక్షల్లో అనేక రకాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఏయే రుద్రాక్షలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి ? అసలు జన్మ నక్షత్రం ప్రకారం ఎవరెవరు ఎలాంటి రుద్రాక్షలను ధరించాలి ? రుద్రాక్షలను ధరించే విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడు మూడు నేత్రాలను మూసి చాలా సంవత్సరాల పాటు ధ్యానంలో ఉంటాడు. శివుడు ధ్యానం నుంచి కళ్లు తెరవగానే ఆయన నేత్రాల నుంచి రాలిన కొన్ని భాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల్లో పడ్డాయి. అవే రుద్రాక్షలుగా మారాయని చెబుతారు. అందువల్ల వాటిని ధరిస్తే అనేక లాభాలను పొందవచ్చు.
శివుడి నేత్రాల నుంచి మొత్తం 38 భాష్పాలు పడ్డాయి కనుక రుద్రాక్షలు కూడా అన్నే ఉన్నాయని చెబుతారు. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. జపం చేసుకుంటానికి, ధరించడానికి చిన్న రుద్రాక్షలను వాడాలి. గురివింద గింజ పరిమాణంలోని రుద్రాక్షలను ఉపయోగించాలి. ఇవి రేగు పండు, ఉసిరికాయ పరిమాణాల్లోనూ లభిస్తున్నాయి.
రుద్రాక్షలన్నీ ధరించదగినవి కావు. కొన్ని అశుభాలను కలిగిస్తాయి. పగిలినవి, పురుగులు ప్రవేశించినవి, గుండ్రగా లేనివి, కండలేనివి ధారణకు పనికిరావు. వీటితో జపం కూడా చేయరాదు.
* ఏకముఖి రుద్రాక్షలను ధరించడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయి. ఈ రుద్రాక్షలు శిశుడి ప్రతిరూపం అని చెబుతారు. వ్యక్తి వికాసం, జ్ఞాన వృద్ధి, సంపద కలుగుతాయి.
* ద్విముఖి రుద్రాక్షలను ధరించడం వల్ల కుండలినీ శక్తి పెరుగుతుంది.
* త్రిముఖి రుద్రాక్షలను ధరిస్తే అనారోగ్య సమస్యలు పోతాయి.
* చతుర్ముఖి రుద్రాక్షల వల్ల మానసిక రోగాలు నయం అవుతాయి. విద్యార్థులు అయితే చదువుల్లో రాణిస్తారు.
* గుండె జబ్బులు ఉన్నవారు పంచముఖి రుద్రాక్షలను ధరించాలి. శత్రువులను సులభంగా జయించగలుగుతారు. పాము కాటు నుంచి రక్షణ లభిస్తుంది.
* షణ్ముఖి (ఆరు ముఖాలు) రుద్రాక్షలను ధరించడం వల్ల బీపీ, హిస్టీరియా తగ్గుతాయి.
* సప్తముఖి రుద్రాక్షలతో అకాల మరణం సంభవించకుండా చూసుకోవచ్చు.
* అష్టముఖి రుద్రాక్షలు వినాయకుడికి ప్రతిరూపం. కుండలినీ శక్తి పెరుగుతుంది.
* నవముఖి రుద్రాక్షలు భైరవునికి ప్రతీక. దుర్గా దేవిని ఆరాధించే వారు ధరించాలి. ఎడమ చేతికి ధరించాల్సి ఉంటుంది.
* దశముఖి రుద్రాక్షలతో అశ్వమేథ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. వీటిని స్త్రీలు ధరించాలి.
* ఏకాదశముఖి రుద్రాక్షలు శివుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
* ద్వాదశముఖి (12 ముఖాలు) రుద్రాక్షలు ఆద్యులకు ప్రతీక. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
* త్రయోదశముఖి రుద్రాక్షలు కామధేనువు, కార్తికేయునికి ప్రతీక. అందం పెరుగుతుంది.
* చతుర్దశముఖి రుద్రాక్షలను పరమశివుని కళ్లుగా భావిస్తారు.
* పంచదశముఖి రుద్రాక్షలు శివుడికి ప్రతిరూపం. ఆధ్యాత్మిక సాధన పొందుతారు.
* షోడశముఖి (16 ముఖాలు) రుద్రాక్షలు కల్పిమాడుకుకు ప్రతీక.
* సప్తదశముఖి రుద్రాక్షలు విశ్వకర్మకు ప్రతీక. సంపదను అందిస్తాయి.
* అష్దాదశముఖి (18 ముఖాలు) భూమికి ప్రతిరూపం.
* ఏకోన్న వింశతిముఖి (19 ముఖాలు) రుద్రాక్షలు నారాయణుడికి ప్రతి రూపం.
* వింశతిముఖి (20 ముఖాలు) రుద్రాక్షలు బ్రహ్మకు ప్రతి రూపం.
జన్మ నక్షత్రం ప్రకారం ధరించాల్సిన రుద్రాక్షలు..
నవరత్నాలకు బదులుగా ఏయే రుద్రాక్షలను ధరించవచ్చో తెలుసుకోండి..
రుద్రాక్షలను ధరించే విషయంలో పాటించాల్సిన నియమాలు..
* రుద్రాక్షలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. సరైన రూపంలో లేని రుద్రాక్షలను, పురుగులు తిన్న రుద్రాక్షలను, పాడైపోయిన రుద్రాక్షలను ధరించకూడదు.
* బంగారం, వెండి, రాగి తీగలు లేదా సిల్కు దారంతో రుద్రాక్షలను ధరించాలి.
* సంభోగ సమయంలో వీటిని ధరించరాదు. ఒక వేళ పొరపాటుగా ధరిస్తే వెంటనే ఆవు పాలతో శుద్ధి చేయాలి.
* రుద్రాక్షలను ధరించేటప్పుడు శివ పంచాక్షర మిత్రం ఓం నమశ్శివాయ ను 108 సార్లు జపిస్తే మంచిది.
* రుద్రాక్షలను ధరించే వారు ఏడాదికి ఒక్కసారి అయినా సరే మాలకు మహాన్యాపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయిస్తే మంచిది. ఈ అభిషేకాన్ని శివరాత్రి రోజు చేయించాలి.
* రుద్రాక్షలను ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసాహారం తినరాదు.
* తమ నక్షత్రాలకు అనుగుణంగా రుద్రాక్షలను ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బీపీ, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలను నయం చేసుకోవచ్చు.