వినోదం

మసూద మూవీలో దయ్యం పట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

తెలుగు సినిమాలలో మరపురాని పాత్రలు అనేకం. కేవలం ఒకటే అని చెప్పడం కష్టం. ఒక సినిమాలో ఏదైనా ఒక పాత్ర అద్భుతంగా పండింది అంటే ఆ పాత్ర గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెడతారు. ఆ నటుడు లేదా నటి పాత్రను బట్టి అట్టే గుర్తుపెట్టుకుంటారు. అలాగే కొన్ని సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి కారణం ఆ పాత్రలే. ఆ పాత్రలో నటించిన నటి ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత కనబరుస్తారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మసూద.

మసుద మూవీ విడుదలయ్యాక అందులో నటించిన మసూద క్యారెక్టర్ ఎవరు అనే విషయంపై ఎక్కువగా మాట్లాడుకున్నారు. నజియా క్యారెక్టర్ లో దయ్యం పట్టిన యువతిగా నటించిన క్యారెక్టర్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. నజియా క్యారెక్టర్ లో నటించిన నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నజియా క్యారెక్టర్ లో నటించిన నటి పేరు బాంధవీ శ్రీధర్. ఈ క్యారెక్టర్ లో బాంధవి అల్లాడించేసింది. థియేటర్ లో అందరినీ వనికించేసింది అనే చెప్పవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి మోడలింగ్ ద్వారా సినిమాలలోకి వచ్చింది.

masooda movie actress name

2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధవి.. అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలిచింది. బాంధవి తండ్రి గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల తనకి నటనపై ఆసక్తి కలిగింది. వారి ప్రోత్సాహంతోనే మోడలింగ్ రంగంలోకి వెళ్ళింది బాంధవి. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్న సమయంలో మసూద మూవీ ఆఫర్ రావడంతో.. ఈ చిత్రంలోని క్యారెక్టర్ నచ్చి ఓకే చేసిందట. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న బాంధవికి సరైన అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి.

Admin

Recent Posts