హెల్త్ టిప్స్

పైత్య ర‌సం త‌ర‌చూ గొంతులోకి వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి..

అపుడపుడూ బైల్ జ్యూస్ గా చెప్పబడే పైత్య రసం ప్రకోపిస్తుంది. లివర్ నుండి విడుదలయ్యే ఈ బైల్ ప్రధానంగా శరీరంలో కొవ్వు కణాలను విడగొడుతుంది. పేగులనుండి పైకి అంటే పొట్ట, గొతులోకి వెనక్కు వస్తే దీనినే పైత్య ప్రకోపం అంటాం. ఈ ద్రవం చాలా చేదుగా ఘాటుగా వుండి వాంతి, వికారం కలిగిస్తుంది. పొట్ట నొప్పి, గుండె మంట వంటివి వస్తాయి. బైల్ వెనక్కు వచ్చి వికారం కలిగించకుండా ఎలా చేయాలో చూడండి.

పైత్యరసం అధికంగా రావ‌టం వలన పొట్ట లేదా గొంతులోకి వెనక్కు వస్తుంది. నిద్ర సమయానికి మూడు లేదా నాలుగు గంటల ముందుగా భోజనం చేయండి. ఈ సమస్య రాదు. బైల్ రసం అధికం కాకూడదంటే, కొద్దిపాటి ఆహారం తరచుగా తీసుకోవాలి. రాత్రులందు తక్కువ నూనెలున్న ఆహారం తీసుకోవాలి. నూనెలు, మసాలాలు కల ఆహారం రాత్రి భోజనంలో తీసుకోవద్దు.

if you are getting bile juice in throat follow these tips

రాత్రులందు నిమ్మరసం లేదా ఆల్కహాల్ వంటివి తీసుకోకండి. కాఫీలు, చాక్లెట్, టమాటాలు, పుదీనా, నిమ్మజాతి పండ్లు, సోడాలు, ఫ్యాటీ ఆహారాలు తినకండి. బైల్ జ్యూస్ గొంతులోకి చేరకుండా తల పైకెత్తి తిన్నగా వుంచండి. నిద్రించేముందు కొద్దిగా నడవండి. ఈ బైల్ సమస్య వున్నవారు రెగ్యులర్ వ్యాయామం చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. నీరు అధికంగా తాగండి. నిద్రించేముందు గోరు వెచ్చని నీరు తాగితే మంచిది. ఇది పైత్య రసం అధికం కాకుండా చేస్తుంది.

Admin

Recent Posts