బయటకు ఎక్కడికైనా భోజనానికి వెళ్ళేటపుడు …పార్టీలు, రెస్టరెంట్లు లేదా రొమాంటిక్ డిన్నర్ లలో కొన్ని మర్యాదలు పాటించాలి. అదే విధంగా ఆహారం కూడా అధికంగా కాకుండా తగినంత మాత్రమే తినాలి. బయట తినేవారికి కొన్ని చిట్కాలు చూడండి. ఎదురుగా కూర్చొన్న వారు ఆల్కహాల్ తీసుకునేవారైతే, మీరు ఫ్రూట్ కాక్ టయిల్ తీసుకోండి. దానిలో తక్కువ ఆల్కహాల్, క్రీమ్, షుగర్ వుంటాయి. సిట్రస్ కాక్ టయిల్ మంచిది.
ఎపెటైజర్ లు గా బ్రెడ్, సలాడ్, కాటేజ్ ఛీజ్ మంచివి. మీరు తినే దానిలో సగం పార్సెల్ చేయమని చెపితే తక్కువగా తిని మిగిలింది తర్వాత తినవచ్చు. పచ్చి కూరలు అధికంగా వుండే ఆహారాలు, కేలరీలు తక్కువ వుండేవి, ఆర్డర్ చేయండి. ఆహారంలో అధికంగా నూనె, నెయ్యి, ఛీజ్ వంటివి వుంటే దానిని పేపర్ టవల్ తో తీసేసి తినండి. మెయిన్ కోర్స్ కొరకు ఉడికించిన రైస్, వంటివి తీసుకోండి. మెల్లగా నమిలి తింటే అధికంగా తినరు. నమలటమనేది మన జీర్ణప్రక్రియకు కూడా సహకరిస్తుంది.
నీరు అధికంగా భోజనం ముందు తాగితే అది మీరు అధికంగా తినకుండా చేస్తుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి. అదనపు కేలరీలు ఖర్చు చేయటానికి ఉపయోగిస్తుంది. ఈ చిట్కాలు బయట మీరు భోజనానికి వెళ్ళినపుడు ఉపయోగిస్తే సౌకర్యవంతంగా వుండి మీ స్నేహితులముందు లేదా మీ పార్టనర్ ముందు మంచి ఇమేజ్ పొందే అవకాశం వుంది.