ఆధ్యాత్మికం

రాత్రి వేళల్లో ఊడిస్తే ఎందుకు వద్దంటారు కారణాలు ఇవిగో…తెలుసుకోండి !!

యుగాలు, తరాలు మారుతున్న కొద్ది ప్రజలు తమ జీవన విధానాలను కూడా మార్చుకుంటున్నారు, అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. ఆ తరంలో ఏ పని చేయాలన్న ఓ పద్దతితో, ఆచార వ్యవహారాలతో ప్రారంభించేవారు. కానీ ఈ తరంలో ఆచార సంప్రదాయాలను మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికి కూడా మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అవే ఆచారాలని పాటిస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయమేమిటంటే వాళ్లు పెట్టిన ప్రతి ఆచారం ఉపయోగకరమైనదే. వారు చెప్పివ ప్రతి విషయంలోనూ సైన్స్ దాగి ఉంటుంది. అలాగే ఆచారాల వెనక ఎన్నో కారణాలు… ఉదాహ‌రణకి చీకటి పడ్డాక చీపురుతో ఇల్లు ఊడవకూడదని అంటారు. దీనిని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ దీని వెనక ఉన్న అసలు కారణం తెలిస్తే అవునా అనాల్సిందే. ఎందుకంటే పాత రోజుల్లో ఇప్పుడున్నట్టు కరెంటు లేదు.

ఇప్పుడైతే 24 గంటలు కరెంటే. కానీ వెనకటి రోజుల్లో చీకటి పడితే కిరోసిన్ దీపాల వెలుగే వారికి ఆధారం అయ్యేది. ఆ వెలుగు కూడా గుడ్డిగా ఉండేది. అలాంటి టైంలో చీపురు పట్టుకొని ఊడిస్తే ఇంట్లో కొన్ని వస్తువులు పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు ఆ విలువైన వస్తువులు చీకట్లో కనిపించవు. ఇక్కడ ఇంకో విషయమేమిటంటే చీకటి పడ్డాక చీపురుతో ఉడుస్తున్నప్పుడు ఆ చీపురుకి ఏమైనా తగిలే అవకాశం ఉంది. అంటే ఏమైనా పురుగులు, కీటకాలు, పాములు, తేళ్లు ఉన్నాయనుకోండి. అవి మనుకు ఆ చీకట్లో కనబడవు, కాబట్టి రాత్రి వేళల్లో అవి కుట్టే అవకాశం ఉంది. అందుకే రాత్రి వేళల్లో ఊడవటం మానేసేవారు.

why our elders say sweeping at night brings bad luck

ఒక వేళ సైన్స్ పరంగా చూసిన… చీకటిలో ఇంట్లో వాకిలి ఉడ్చినప్పుడు దుమ్ము,ధూళి ఉంటుంది. రాత్రి వేళల్లో అది మనకు కన్పించదు. అందువల్ల అది మనం తినే ఆహార పదార్ధాలపై పడితే మనకు కన్పించదు. ఒకవేళ ఆ ఆహారం తీసుకున్నా రోగాల బారిన పడాల్సిందే. అందుకే మన పెద్దలు కూడా రాత్రి వేళల్లో చీపురు పట్టుకొని ఊడవవద్దని చెప్పేది. అయితే ఈ ఆచారాన్ని ఇప్పటికి చాలా మంది పాటిస్తున్నారు. అందుకే పెద్దల మాట సద్ది మూట అనేది మనం వారు చెబుతున్న విషయాలను పట్టించుకోకపోయిన ఓ సారి ఆలోచిస్తే దాని వెనక ఉన్న మర్మం అయిన తెలుస్తుంది.

Admin

Recent Posts